ది బర్త్ 10,000 బిసి ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన..

434

ప్రతాప్ రానా కథానాయకుడిగా డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష్య ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ది బర్త్ 10,000 బిసి. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విక్రమ్. ప్రయోగాత్మక కథను కమర్షియల్ కోణంలో చూపిస్తున్నారు విక్రమ్. ఈ ఇండియన్ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈ మధ్యే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసారు. ఆదిమానవుడిగా మొదలైన మనిషి జీవితం క్రమంగా ఎలా మారింది అనేది ఈ ట్రైలర్‌లో చూపించారు.

విడుదలైన క్షణం నుంచి కూడా ఆడియన్స్ నుంచి ఈ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు జుధా సంధీ సంగీతం అందిస్తున్నారు. మహేష్ తొగట ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆనంద్ సుందరీష ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతుంది ది బర్త్ 10,000 బిసి.

నటీనటులు: ప్రతాప్ రానా

టెక్నికల్ టీం:
ప్రొడక్షన్ హౌజ్: శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష్య ప్రొడక్షన్స్
దర్శకుడు: డాక్టర్ విక్రమ్
Dop: ఆనంద్ సుందరీష
ఎడిటర్: మహేష్ తొగట
సంగీతం: జుదా సంధీ
భాషలు: కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్
జోనర్: హిస్టారికల్ అడ్వంచర్

Eluru Sreenu
P.R.O