దిగ్గజ గీత రచయితల సమక్షంలో ఘనంగా “రేవు” సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్, ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

22

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. గీత రచయితలు  చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అతిథులుగా ఈ రోజు హైదరాబాద్ లో రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

గీత రచయిత చంద్రబోస్ మాట్లడుతూ – రేవు సినిమా ఆడియో ఫంక్షన్ కు మా ప్రభు అన్న పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ సినిమా పాటలు విన్న తర్వాత సరైన కార్యక్రమానికే వచ్చాను అనిపించింది. అశోక్ తేజ గారిని చూసి చాలా రోజులవుతోంది. అలాగే అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గారిని ఈ వేదిక మీద కలుసుకోవడం సంతోషంగా ఉంది. రేవు సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. అన్నిఎమోషన్స్ తో పాటలు రాశారు. సంగీతం బాగుంది. రేవు సినిమాలో నవ్యత, నాణ్యత రెండూ కనిపించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – రేవు పాటల విన్నాక ఒక ఉద్విగ్నతకు లోనయ్యాను. అంత బాగున్నాయి. మనం కంటెంట్ ఉన్న వైవిధ్యమైన సినిమాలు కావాలంటే పర భాషల వైపు చూస్తుంటాం. కానీ రేవు సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది. రేపటి తెలుగు సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. ఇది మా దమ్ము అంటూ పాటల్ని చూపించి  ఇది అనిపించుకున్నారు రేవు టీమ్. లిరిసిస్ట్ ఇమ్రాన్, మ్యూజిక్ చేసిన జాన్ కు కంగ్రాట్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దర్శకుడు హరినాథ్ కు శుభాకాంక్షలు. తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు రావాలి అప్పుడే మనవారి ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాటలు లిరిక్స్ కు ట్యూన్ చేశారని తెలిసింది. ఇంకా సంతోషం. ఈ రేవు సినిమా బాక్సాఫీస్ వద్ద రేవెట్టాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు సారథ్యం వహిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – మేము పాటలు రాయని ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చామంటే ప్రభు గారి మీద మాకెంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన నేను గీత రచయితగా ఓనమాలు దిద్దక ముందే నా ఆనవాళ్లు చూపించారు. నా కెరీర్ ప్రారంభం నుంచి తన ప్రోత్సాహం అందిస్తున్నారు. రేవు సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. గీత రచయితగా ఇమ్రాన్ శాస్త్రి నాలాగే మొదటి సినిమాకే సింగిల్ కార్డ్ రాసే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా కరుణ, రౌద్ర వంటి అనేక భావోద్వేగాలున్న పాటలు రాయడం అభినందనీయం.జాన్ సంగీతం బాగుంది. ఈ రేవు సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – రేవు సినిమా కార్యక్రమం చూస్తుంటే కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది. నేను తీరప్రాంతంలో పుట్టలేదు కానీ తీరప్రాంత ప్రజల గురించి తెలుసు. వారి జీవన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. రేవు సినిమా వేదిక మీద అక్షరాలన్నీ కలిపినట్లు ఉంది. ఈ ప్రయత్నం చేసిన ఘనత ప్రభు గారిది, పర్వతనేని రాంబాబు గారిది. ఈ ఆడియో ఫంక్షన్ కు గీత రచయిలను అతిథులుగా పిలవడం గొప్ప సంప్రదాయంగా చెబుతున్నా. ఈ క్యాసెట్ ను నేను దాచుకుంటా. అప్పట్లో రాఘవేంద్రరావు, దాసరి గారి సినిమాలకు పనిచేసి ఆ క్యాసెట్ అందుకున్నప్పుడు కలిగిన సంతోషం ఇప్పుడు కలుగుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. మనమంతా రేవు సినిమాకు సపోర్ట్ చేయాలి. ఇది స్ఫూర్తిగా కొత్త ప్రతిభావంతులు సినిమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

రేవు సినిమా నిర్మాణ పర్యవేక్షకులు ప్రభు మాట్లాడుతూ – నా మీద అభిమానంతో ఈ రోజు రేవు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన మా చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గార్లకు థ్యాంక్స్. తెలుగు పాటకు పట్టం కట్టిన గొప్ప గీత రచయితలు వీరంతా. ఈరోజు ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. రేవు సినిమా పెద్ద కమర్షియల్ హంగులు ఉన్న మూవీ కాదు. ఇదొక జీవన పోరాటం. మత్య్సకారుల జీవితాలను తెరపై చూపిస్తుంది. మా దర్శకుడు హరినాథ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ నుంచి తీసుకున్న వర్క్ స్క్రీన్ మీద మనందరినీ ఇంప్రెస్ చేస్తుంది. వారు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ సినిమా చేశారు. మా మిత్రుడు డా.మురళీ గింజుపల్లి గారి నిర్మాణంలో రేవు సినిమా మీ ముందుకు వస్తోంది. నా మిత్రుడు పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరి సపోర్ట్ రేవు సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ – రేవు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా లిరిసిస్ట్ ఇమ్రాన్ శాస్త్రి, మ్యూజిక్ చేసిన జాన్…ఈ ఇద్దరిలో అన్ని మతాలు ఉన్నాయి. అందుకే అన్ని వర్గాల వారికీ నచ్చేలా పాటలు రూపొందించారు. పాటలు హిట్టయినట్లే రేవు సినిమా టీమ్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

గీత రచయిత ఇమ్రాన్ శాస్త్రి మాట్లాడుతూ – మా సినిమా ఆడియో రిలీజ్ వేదిక మీద ఉన్న గొప్ప రచయితలు అందరికీ పాదాభివందనం. మా ఈ వేదిక మీద ఆస్కార్ నుంచి అన్ని ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నట్లు భావిస్తున్నా. మీ అందరి ఆశీస్సులు మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ – మా రేవు సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన గీత రచయితలు చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, కాసర్ల శ్యామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లో వీరితో కూడా పనిచేసే అదృష్టం కలగాలని ఆశిస్తున్నా. రేవు సినిమాకు మా మిత్రుడు మురళీ గింజుపల్లి గారు, నవీన్ పారుపల్లి గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రేవు సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నాం. రేవు మూవీ మంచి సక్సెస్ కావాలని, ఈ బ్యానర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ – రేవు సినిమాను మత్స్య కారుల జీవితాలను ప్రతిబింబించేలా రూపొందించాను. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఎవరూ లేరు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనుకుంటున్న టైమ్ లో ప్రభు గారు, పర్వతనేని రాంబాబు గారు ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇవాళ ఇంతమంది పెద్దలు మా సినిమా ఈవెంట్ లో పాల్గొని ఆశీర్వదించారు. మా రేవు టీమ్ అందరి తరుపున ఈ పెద్దలందిరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. రేవు సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.

ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.

సాంకేతిక నిపుణులు: డి ఓ పి – రేవంత్ సాగర్ నేపథ్య సంగీతం- వైశాఖ్ మురళీధరన్ పాట- జాన్ కె జోసెఫ్ ఎడిటర్ – శివ శర్వాని కళ- బాషా సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.

P.Rambabu
cinejosh.com
9848 123 007