HomeTeluguశ్రీ కృష్ణార్జునమూవీ మేకర్స్ బ్యానర్లో "టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్ "

శ్రీ కృష్ణార్జునమూవీ మేకర్స్ బ్యానర్లో “టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్ “

శ్రీ కృష్ణార్జునమూవీ మేకర్స్ బ్యానర్లో పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్ నిర్మాతగా CVSM వెంకట్ రవీంద్రనాథ్ MS ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మొదటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు .గతములో గ్రామాలలో మాతంగులుగా జీవిస్తున్నవారి వారి జీవితాల ఆధారముగా ఒక కథను తీసుకుని హర్రర్ థ్రిల్లర్ జోడించి “టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్ “అనే చిత్రం నిర్మిస్తున్నారు.మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఈ షెడ్యూల్లో ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు ఒక మాంత్రికుడు పాత్రలో కనిపిస్తారని.. ఈ చిత్రంలో ముగ్గురు కొత్త అమ్మాయిలు హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నామని చెప్పారు.
రెండవ షెడ్యూల్ జూన్ 12 నుండి ప్రారంభమవుతుందని ఈ షెడ్యూల్లో ప్రముఖ విలన్ పాత్రధారి సత్యప్రకాష్, కమెడియన్ ‘చిత్రం’ శ్రీను, జబర్దస్త్ టీం, ‘జూనియర్’ రాజశేఖర్, ‘ప్రేమకథచిత్రం ఫేమ్’ సైదులు నటించనున్నారని డైరెక్టర్ CVSM వెంకట్ రవీంద్రనాథ్ M.S తెలిపారు.
నిర్మాత
పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతుందని ,చిత్రానికి DOP గా PK స్టిల్ రాజ్ కమల్ , ప్రొడక్షన్ కంట్రోలర్ గా పూజారి భాస్కర్ రాజు వ్యవహరిస్తున్నారని ఇతర టెక్నీషియన్స్ మరియు చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం రెండవ షెడ్యూల్ తర్వాత తెలియజేస్తామని అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES