తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్ మైభు బ్ బేగ్ (అలియాస్ కదిరి బాష), కోశాధికారిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్‌రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శిగా బి.లక్ష్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.డి. జమాలుద్దీన్ విజయం సాధించారు. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, స్టార్ డైరెక్టర్. బోయపాటి శ్రీనివాస్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎన్.దొరౖెె, కోశాధికారి సురేష్ సమక్షంలో తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.