సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ స‌పోర్ట్ – ఆర్‌.కె.గౌడ్‌

174

గ‌త ప‌ది సంవ‌త్స‌రాల నుండి ఫిలిం ఇండ‌స్ట్రీకి ఎంతో స‌పోర్ట్‌గా ఉండి ఎల్ల‌వేళ‌లా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి, బీ ఆర్ ఎస్ పార్టీకి స‌పోర్ట్ చేయాల‌ని మేమందరం నిర్ణ‌యించుకున్నాం. సినీ కార్మికులంద‌రూ కూడా మీ ఏరియాలో ఉండే బి.ఆర్‌.ఎస్ ఎం.ఎల్‌.ఏ అభ్య‌ర్థుల‌కు ఈనెల 30న జ‌రిగే పోలింగ్‌లో అంద‌రూ పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుకుంటున్నాం.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఏ అవ‌స‌రం ఉన్నా టికెట్ రేట్లు, స్పెష‌ల్ షో, షూటింగ్ లొకేష‌న్ పర్మిష‌న్స్‌, ఇంకా ఎలాంటి అవ‌స‌రాలున్నా ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్పందించి కేటీఆర్‌, హ‌రీష్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మాగంటి గోపినాధ్‌, దానం నాగేంద‌ర్‌, ప‌ద్మారావుగౌడ్‌, ప్ర‌కాష్ గౌడ్ త‌దిత‌రులు త్వ‌రిత‌గ‌తిన స్పందించి సీఎం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ళి సినీ కార్మికుల‌కు కావాల్సిన డ‌బుల్ బెడ్రూమ్స్‌, క‌ళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్‌, ఆస‌రా ఫించ‌న్లు, దివ్యాంగుల పెన్ష‌న్లు, స్టూడియో ర‌న్ అవ్వ‌డానికి 24 గంట‌ల క‌రెంట్‌.. ఇలాంటి ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్న ప్ర‌భుత్వం ఇక్క‌డ ఉండే ప్ర‌జ‌ల్లో ఆంధ్ర‌, తెలంగాణ ఎవ‌రినైనా సోద‌ర భావంతో క‌లిసి మెల‌సి ఉండాల‌ని 10 సంవ‌త్స‌రాలు ఒక్క‌తాటిపై న‌డిపించారు. హైద‌రాబాద్‌లో గ‌త ప‌దేళ్ళ కాలంలో ఒక చిన్న గొడ‌వ కూడా జ‌ర‌గ‌కుండా ఉండే విధంగా న‌డిపిస్తున్నారు. సిటీలో సాఫీగా వెళ్ళేందుకు ఫ్లైఓవ‌ర్ నిర్మాణం జ‌రిపించారు. మ‌రింత అభివృద్ధి సాధించాలి అంటే బీ ఆర్ ఎస్ కారు గుర్తుకే మీ అమూల్య‌మైన ఓటు వేసి గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ తెలిపారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్‌, నిర్మాత గురురాజ్‌, నిర్మాత సాగ‌ర్‌, నిర్మాత కాచం స‌త్య‌నారాయ‌ణ‌, డైరెక్ట‌ర్ బందూక్ ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత ర‌మేష్ నాయుడు, డైరెక్ట‌ర్ న‌ర్సింహ‌, నిర్మాత ఇ.వి.యం.చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.


RK.Chowdary PRO 9848623335