ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రానికి వడత్యా హరీష్ దర్శకుడు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం డి.టి.ఎస్ మిక్సింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లుగా చిత్రయూనిట్ తెలియజేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ గారు ఇచ్చిన సహకారం, సపోర్ట్ మరిచిపోలేనిది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్ అద్భుతంగా చూపించబోతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..” అని తెలిపారు.
శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
నిర్మాత: మహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
పీఆర్వో: బి.ఎస్. వీరబాబు
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్
—
Veerababu PRO
9396410101