HomeTeluguప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా "అందెల రవమిది" సినిమా టీజర్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అందెల రవమిది” సినిమా టీజర్ రిలీజ్

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో నాట్యమార్గం ప్రొడక్షన్స్ ఇంద్రాని దవులూరి నిర్మిస్తున్నారు. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, ఐడీపీఎల్ నిర్మల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ వుమెన్ మేడ్ ఫిలిం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ గా పలు పురస్కారాలు గెల్చుకోవడం విశేషం. అందెల రవమిది సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ఇంద్రాని దవులూరి గారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. వారు అమెరికాలో స్థిరపడ్డారు. మన కళలు, సంస్కృతీ సంప్రదాయాల మీద ఇంద్రానికి గారికి ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే యూఎస్ లో పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్ లు నేర్పిస్తుంటారు. హద్దులు దాటుతున్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్ లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కల్చర్ ను తెలియజెప్పాలనే ప్రయత్నంతో అందెల రవమిది చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా తెరకెక్కించడంలో ఇంద్రాని గారికి సాయి, సురేష్ ఎంతో సహకరించారు. అలాగే భరణి గారు ఓ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి మంచి చిత్రానికి మనమంతా సపోర్ట్ చేయాలి. అన్నారు.

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – సాగరసంగమం, శంకరాభరణం వంటి మూవీస్ వచ్చిన తర్వాత చాలామంది మన సంగీతం, నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలాంటి ఇంపాక్ట్ కలిగించాయి ఆ సినిమాలు. ఇంద్రాని నాకు కూతురు లాంటిది. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. భరతనాట్యం నేపథ్యంగా అందెల రవమిది సినిమా చేసింది. సినిమా నిర్మించడం అంటే ఒకటి కాదు వంద పెళ్లిల్లు చేసినంత కష్టం. చిన్న సినిమాకు ఉండే అలాంటి కష్టాలన్నీ పడి ఇంద్రాని ఈ సినిమా పూర్తి చేసింది. మన కళల్ని తెలియజేసేందుకు ఇంత శ్రమకోర్చి అందెల రవమిది సినిమా రూపొందించిన ఇంద్రానికి నా అభినందనలు చెబుతున్నా. ఈ సినిమాకు మనవంతు సహకారం అందించడమే మనమంతా చేయాల్సిన బాధ్యత. అన్నారు.

దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ – ఇంద్రాని గారు నాకు ఎప్పటినుంచో పరిచయం. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకునే వాళ్లు శారీరకంగా ఎలా ఒత్తిడికి లోనవుతారు, వాళ్లు ఎలా స్ట్రాంగ్ గా కావాలనే విషయంపై పుస్తకాన్ని రాశారు. మన కళల్ని బతికించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఈ సినిమా కోసం ఇంద్రాని గారు వారి టీమ్ సాయి, సురేష్ ఎంతో కష్టపడ్డారు. హరీశ్ , భరణి గారు ఈ సినిమా కోసం తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు. అందెల రవమిది సినిమాకు మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు ఆదిత్య మీనన్ మాట్లాడుతూ – ఇంద్రాని దవులూరి నాకు 15ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం కలిసి మలయాళ మూవీలో నటించాం. ఆమె యామినీ శర్మ అనే స్క్రీన్ నేమ్ తో మూవీస్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లి అక్కడ మన కళల్ని ప్రోత్సహిస్తున్నారు. భరణి గారు చెప్పినట్లు ఇటీవల మన కళల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాను. సురేష్, సాయి అండ్ టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంద్రాని గారు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ ఉత్తరాది మాట్లాడుతూ – మా మూవీకి సపోర్ట్ చేసేందుకు వచ్చిన హరీశ్ గారికి, భరణి గారికి, కృష్ణ చైతన్య గారికి థ్యాంక్స్. మన కళల్ని బతికించేందుకు ఇంద్రాని గారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. మాకు మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు

నటి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంద్రాని దవులూరి మాట్లాడుతూ – భరతనాట్యం 2 వేల ఏళ్ల నాటి నృత్య కళ. ఈ కళను బతికించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మన కళల్ని తెలియజేయాలని ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఎంతో శ్రమకోర్చి రూపొందించాం. మా టీమ్ అంతా బాగా సపోర్ట్ చేశారు. వెస్ట్రన్ డ్యాన్స్ లు 30 ఏళ్ల తర్వాత చేయలేరు. కానీ భరతనాట్యం చనిపోయే వరకు చేయొచ్చు. అలాంటి ప్రత్యేకత మన సంప్రదాయ నృత్యరీతులకు ఉంది. మా మూవీకి డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ వుమెన్ మేడ్ ఫిలిం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ గా పలు పురస్కారాలు దక్కాయి. మరికొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ స్క్రీనింగ్ లో మా సినిమా ఉంది. అందెల రవమిది చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న హరీశ్ గారికి భరణి గారికి ఆదిత్య మీనన్ గారికి కృష్ణ చైతన్య గారికి థ్యాంక్స్. మీరంతా మన సినిమా అనుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – ఇంద్రాని దవులూరి, విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, ఐడీపీఎల్ నిర్మల , తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – ఎస్ కే భూపతి, హర్ష్ మహదేశ్వర్
ఎడిటింగ్ – వెంకటేష్ ఆవుల
మ్యూజిక్ – కార్తీక్ కొడకండ్ల
బీజీఎం – వెంకటేష్ పట్వారీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సురేష్ ఉత్తరాది
కో డైరెక్టర్ – సాయి పల్లె
సమర్పణ – శివ భట్టిప్రోలు
బ్యానర్ – నాట్యమార్గం ప్రొడక్షన్స్
స్టోరీ – వేణు నక్షత్రం
ప్రొడ్యూసర్, డైరెక్టర్ – ఇంద్రాని దవులూరి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES