HomeTeluguధర్మస్థలి సక్సెస్ తో మా కష్టాన్ని మర్చిపోయాం – శకలక శంకర్.

ధర్మస్థలి సక్సెస్ తో మా కష్టాన్ని మర్చిపోయాం – శకలక శంకర్.

‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు రమణ మొగిలి బాగా తీశారు’’ అన్నారు శకలక శంకర్. పావని,భూపాల్ రాజ్, షాజీ షిండే ,మిర్చిమాధవి, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధర్మస్థలి’. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.

ఈ సందర్భంగా శకలక శంకర్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. రాజేంద్ర భరద్వాజ్ రాసిన మాటలు, వినోద్ యాజమాన్య చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఆడియెన్స్ నుంచి మచి స్పందన లభిస్తోంది ‘‘మౌత్‌ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా ‘ధర్మస్థలి’ సినిమా ఎమోషనల్‌ హిట్‌ అంటున్నారు అని దర్శకుడు రమణ మొగిలి తెలియ చేసారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం, సినిమా చూసినవారు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు అన్నారు ఎక్సిక్యూటివ్ నిర్మాత ఆకుతోట సంజు. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నందుకు హ్యాపీగా ఉందని ‘‘సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సహా నిర్మాత సిరాజ్ .

న‌టీన‌టులు .. శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హ‌సిని, ర‌మ్య‌,స్వాతి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..
రొచిశ్రీ మూవీస్.నిర్మాత‌.. Mr రావు, స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు.. ర‌మ‌ణ మోగిలి, మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌, స్టోరి, స్క్రీన్‌ప్లే,మాట‌లు- రాజేంద్ర భ‌రధ్వాజ్‌, కెమెరా.. జి ఎల్ బాబు, ఎడిట‌ర్.. వి.నాగిరెడ్డి, వి ఎఫ్ ఎక్స్‌.. డిజి పోస్ట్, ఫైట్స్‌.. మ‌ల్లేష్‌, డాన్స్‌..చంద్ర కిర‌ణ్‌, ఆర్ట్‌.. సాంబ‌,లిరిక్స్‌.. గోసాల రాంబాబు,ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ అకుతోట సంజు.

పిఆర్ఓ.. ఏలూరు శ్రీను, మెఘ‌శ్యామ్‌,

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES