“తానా- అమ్మానాన్న గురువు పద్యార్చన — –తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారు.

794

“ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తలపెట్టిన ‘”అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” కు అత్యంత వైభవంగా శుభారంభం జరిగిందని , ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటి వరకు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందనీ,
ఇది సాహితీ చరిత్రలో అపూర్వమైన,అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుందని…
ఇది ‘కన్నవారికి కనకాభిషేకం..
పద్యానికి పట్టాభిషేకం…
అమ్మ భాషకు అమృతాభిషేకం…’ వంటిడని”
తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి శేఖర్ గారు అన్నారు.

అమెరికాలోని న్యూయార్క్ నగరం లో ముఖ్యఅతిథి గా హాజరై స్వయంగా తాను పద్యాలు కంఠస్థం చేసి పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఒక ప్రకటన చేస్తూ…. “జనవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు విద్యార్థులకు ‘అమ్మానాన్న గురువు- శతక పద్యార్చన’ నిర్వహించామని, శత శతక కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు రచించిన అమ్మ శతకం,నాన్న శతకం గురువు శతకాలలోని పద్యాలను విద్యార్థులందరూ కనీసం ఒక్కొక్క శతకం లోనుంచి పది పద్యాల చొప్పున మొత్తం ముప్పయి పద్యాలు కంఠస్థం చేసి సామూహికంగా గానం చేయటం ఈ కార్యక్రమంలోని విశేషమని” ఆయన అన్నారు.

అమ్మానాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం పెరిగే విధంగా తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, మానవతా విలువలు ప్రోదిగొల్పుట వంటి మహనీయమైన లక్ష్యాలతో ఈ పవిత్రమైన యజ్ఞంను తానా తల పెట్టిందని ఈరోజు అది ఎంతో విజయవంతంగా జరిగిందని, భాషా సంస్కృతుల పరిరక్షనార్ధం ఈ బృహత్ యజ్ఞం కొనసాగుతుందని” ఆయన అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు,మరియు అమెరికా లోని న్యూయార్క్, ఫిలడెల్ఫియా, కొలంబస్, బేఏరియా కాలీఫొర్నియా వంటి దాదాపు ముప్పై నగరాలలోని తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాషాభిమానాన్ని,అమ్మ నాన్న గురువుల పట్ల ప్రేమాభిమానాలను ఏక కాలంలో చాటారని” తెలియజేశారు.

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పద్యాలు నేర్చుకుని రాగయుక్తంగా ఆలపించారని , ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని” ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతం కావాలని తమ అమూల్యమైన ఆశీస్సులు అందించిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి, సినీ గేయ రచయిత చంద్రబోస్ గారికి, జె.డి లక్ష్మీనారాయణ గారికి,శ్రీ తనికెళ్ల భరణి గారికి,శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారికి,గాయిని సునీత గారికి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.

ఈ కార్యక్రమలో ఎంతో సహకరించిన శ్రీ శ్రీనాథ్ కుర్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ బృహత్ యజ్ఞంలో మాకు సలహాలు సూచనలు అందించిన గురు తుల్యులు శ్రీ జంపాల చౌదరి గారికి,బోర్డ్ ఛైర్మన్ శ్రీ హరీష్ కోయా గారికి,ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి,ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ అంజయ్య చౌదరి గారికి,పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ సతీష్ వేమన గారికి,సెక్రటరీ శ్రీ అశోక్ కొల్లా గారికి, ఉమెన్స్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల గారికి,శ్రీ రాం సుమంత్ గారికి,శ్రీ రాజా కసుకుర్తి గారికి,రాం చౌదరి ఉప్పలూరి గారికి,ఇతర సభ్యులందరికి పేరుపేరునా మా ధన్యవాదములు. మరియు శ్రీ శ్రీనివాస్ పాటిబండ్ల గారికి ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో సేవలందించిన పనిచేసిన మా జిల్లా , ప్రాంతీయ సమన్వయకర్తలకు,పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు, బాలబాలికలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి పాఠశాలకు తానా ప్రశంసా పత్రాలను త్వరలో అందజేస్తామని” ఆయన తెలియజేశారు.