అఖిల్ సార్థక్ ‘ఫస్ట్ టైమ్’ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ నటుడు మైమ్ గోపీ..

579

సాయిరాం క్రియేషన్స్ సమర్పణలో హేమాంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై స్టార్ బాయ్ అఖిల్ సార్థక్, అనికా విక్రమన్ హీరో హీరోయిన్లుగా ఐ హేమంత్ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ టైమ్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 12 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మూడో షెడ్యూల్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పిన కథ చెప్తున్నామంటున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో ప్రముఖ నటుడు మైమ్ గోపీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈయనకు స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ కూడా డిజైన్ చేసింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.

నటీనటులు: అఖిల్ సార్థక్, అనికా విక్రమన్, మైమ్ గోపీ, అజయ్ రత్నం, శివ కుమార్, భూపాల్, చక్రపాణి, సంధ్యా జనక్ తదితరులు

టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు: ఐ హేమంత్
సహ నిర్మాత: మంఖాల్ వీరేంద్ర
సినిమాటోగ్రఫర్: మురళి వి
సంగీతం: శ్రీ వెంకట్
ప్రొడక్షన్ కంట్రోలర్: కె లక్ష్మణ రావు
క్యాస్ట్యూమ్ డిజైనర్: పి విజయ్
ఆర్ట్ డైరెక్టర్: భూపతి యాదగిరి
మేకప్: ఆనంద్
ఫైట్స్: సతీష్, మధు
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్