HomeTeluguనిర్మాత లగడపాటి శ్రీదర్ విడుదల చేసిన 'టేక్‌ డైవర్షన్‌' ట్రైలర్.

నిర్మాత లగడపాటి శ్రీదర్ విడుదల చేసిన ‘టేక్‌ డైవర్షన్‌’ ట్రైలర్.

పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో, శివకుమార్‌ హీరోగా పరిచయమవుతూ, హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నా చిత్రం టేక్ డైవర్షన్. శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ప్రేమ కథాచిత్రంగా ఇది రూపొందుతోంది. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీదర్ ట్రైలర్ విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో రాజేష్ సూరిశెట్టి, రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల, సురేష్ కొండేటి, డాక్టర్ గౌతం కశ్యప్, ఉమర్జీ అనురాధ పాల్గొన్నారు.

పోస్టర్ లాంచ్ అనంతరం లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. టేక్ డైవర్షన్ చాలా మంచి టైటిల్. ముక్యంగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి నిర్మిస్తున్న సినిమా కాబట్టి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అన్నదమ్ములు అన్నాకా ముగ్గురు మూడు రంగాల్లో కాకూండా అందరు కలిసి సినిమా నిర్మాతలుగా మారడం మంచి పరిణామం. ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేస్తున్న టేక్ డైవర్షన్ సినిమా మంచి విజయం సాదించాలి. ట్రైలర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా హిట్టై మరిన్ని మంచి చిత్రాలు తెలుగులో వీళ్ళు నిర్మించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అనురాధ మాట్లాడుతూ .. టేక్ డైవర్షన్ అనే సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల గార్లకు అభినందనలు తెలుపుతున్నాను. చాలా తపన ఉన్న టీమ్ ద్వారా ఈ సినిమా రెడీ అయింది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. ఇది భిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే ఇందులో మ్యూజిక్ కు చాలా మంచి స్కోప్ ఉంది అన్నారు.

లిరిక్ రైటర్ డాక్టర్ గౌతం కశ్యప్ మాట్లాడుతూ ..మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా నిర్మాతలతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. వాళ్ళు చాల మంచి వాళ్ళు, పైగా సినిమా అంటే తపన ఉన్న వాళ్ళు. ముఖ్యంగా ఈ ముగ్గురు అన్నదమ్ములకు అండగా ఉన్న వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది. నిజానికి సినిమా రంగంలోకి వెళ్తున్నాము అంటే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు.. కానీ వీళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తూ డబ్బులు కూడా పెట్టడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు సినిమా రంగంలోకి రావడం చాలా మంచిది. అలాంటి వారు వస్తే మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్ కూడా చాలా సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఈ కథలో మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉంది. తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది. ఈ సినిమాకు సురేష్ కొండేటి సపోర్ట్ ఉంది . అయన సపోర్ట్ ఉందంటే ఇక సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన చందు మద్దాల మాట్లాడుతూ.. తెలుగు తమిళ భాషల్లో ఈ టేక్ డైవర్షన్ అనే సినిమా చేస్తున్నాం. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. దర్శకుడు సెంథిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండ తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమా విషయంలో మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అనురాధ గారికి థాంక్స్ చెప్పాలి అన్నారు.

నిర్మాత వెంకట్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ ని మొదలెట్టి మంచి సినిమాలు చేయాలన్న సంకల్పంతో ముగ్గురు అన్నదమ్ముల కలిసి ఈ బ్యానర్ ని స్థాపించాం. మంచి కథ, కథనాలతో తెరకెక్కిన టేక్ డైవర్షన్ సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల డేట్ ప్రకటిస్తాం. ముక్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు వచ్చిన లగడపాటి శ్రీధర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్ అనాలా, విలన్ అనాలా అని చెప్పే జాన్ విజయ్ గారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అయన మాకు అందించిన సపోర్ట్ కు ధన్యవాదాలు అన్నారు.

రామ్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలెట్టి చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ్ భాషల్లో చేస్తున్నాం. శివాని సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది అన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు జోసెఫ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. అలాగే సురేష్ కొండేటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచి సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు సపోర్ట్ అందిస్తున్నారు అన్నారు.

https://we.tl/t-vwBBQXnuDJ

PRO
Suresh Kondeti

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES