ఎన్నో వైవిధ్యమైన కథలకు తెరలేపిన తెలుగు ఇండస్ట్రి మరో వినుత్నమైన కథతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో.. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ తెరకెక్కించి మంత్ర సినిమా పెద్ద సెన్సెషనల్ హిట్ గా నిలించింది. ఆ సినిమాతో ఛార్మీ కెరీర్ ఓ మలుపు తిరిగిన విషయం తెలిసిందే. తరువాత ఇదే బ్యానెర్ లో మళియాల గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాన్ని తెరకెక్కింది. ఈ సినిమా అనుపమకు కెరియర్ లో బెస్ట్ సినిమా నిలిచిపోయింది. దాంతో జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ తో అనుపమకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ పై, మంత్ర సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటి డెబ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్.. ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తుంది.
రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ లతో పాటు సినయర్ నటుడు మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగావల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రాణం పోసేది మ్యూజికే.. మరీ అలాంటి అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను గిడియన్ కట్టా అందించారు. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా చాలా అద్బుతంగా ఉన్నాయి. అలాగే సినిమాలో వాడిన కలర్స్ కూడా చాలా బాగా పోట్రెట్ చేశారు డీఓపి అమర్ దీప్ గుత్తుల. ప్రతీ ఫ్రేమ్ లో సినిమా నిర్మాణవిలువలు గొప్పగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశారు. ది మోస్ట్ టెర్రిఫిక్ కేస్ ఇన్ ద ఇండియన్ హిస్ట్రీ అంటూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. మరీ ఆ కేసేంటో దాన్ని ఎలా చేదించారో తెలుసుకోవాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
చాలా వైవిధ్యమైన కథతో నేటితరం యువతకు నచ్చేలా ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాను తెరకెక్కించామని, యువతకు కావల్సిన అన్ని అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఈ సినిమాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, మంత్ర సినిమాతో ఛార్మీ కి ఎలాంటి పేరు వచ్చిందో ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అంతే మంచి పేరు వస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. నాన్నకు ప్రేమతో, సీతారామమ్ వంటి సినిమాలను విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన “రిలియాన్స్ ఎంటర్ టైన్మెంట్” సంస్థ “ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్” సినిమా చూసి, వారికి ఎంతగానో నచ్చి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుల చేస్తుండటం సంతోషంగా ఉందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది.
ఈ సందర్భంగా జెన్ నెక్ట్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ అనుపమకు ఉన్న అనుబంధంతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టీమ్ తో ఓ ఇంటర్ వ్యూ కూడా చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్ వ్యూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినిమాపై పాజిటీవ్ అంచనాలు పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
నటీ నటులు:
నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల
ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సాదునూరు
డి. ఓ. పి : అమర్ దీప్
ఎక్సగ్యూషన్ లీడ్ : పాంచజన్య పోతరాజు
క్రియేటివ్ హెడ్ : కృష్ణ చైతన్య పసుపులేటి
ఆర్ట్ : విజయ్ మక్కెన
సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ : గిడియన్ కట్ట
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి
ప్రొడక్షన్ హెడ్ : అరవింద్ కుమార్ పిట్టల
డబ్బింగ్ & డి ఐ : జయంతి స్టూడియో
సౌండ్ ఎఫెక్ట్స్ : నాగ కిరణ్
వి ఎఫెక్ట్స్ : ప్రైమ్ పిక్సెల్
డాల్బీ మిక్సింగ్ : ప్రసాద్ ల్యాబ్ అట్మాస్ స్టూడియో