HomeTelugu*శ్రీ సింహా హీరోగా, డి. సురేష్ బాబు సమర్పణలో "భాగ్ సాలే"*

*శ్రీ సింహా హీరోగా, డి. సురేష్ బాబు సమర్పణలో “భాగ్ సాలే”*


కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి “భాగ్ సాలే” చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి “భాగ్ సాలే” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం శ్రీ సింహ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. “మత్తు వదలరా”, “తెల్లవారితే గురువారం” చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రమిది.

సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ గతంలో *”పెళ్లి చూపులు”, “ఏ బీ సీ డీ” మరియు “దొరసాని”* వంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాయి. తమ కొత్త ప్రాజెక్ట్ తోనూ ఇదే తరహా విజయంపై నమ్మకంగా ఉన్నాయి. దర్శక నిర్మాతగా మధుర శ్రీధర్ రెడ్డి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఆయన “స్నేహగీతం”, “బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్”, “లేడీస్ అండ్ జెంటిల్ మన్”, “ఏబీసీడీ” లాంటి న్యూ ఏజ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే” టైటిల్ సాలిడ్ గా ఉంది. శ్రీ సింహ లుక్, క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ లో శ్రీ సింహ షేడ్ ఫొటో, టైటిల్ పక్కన పరుగులు పెడుతున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోలు ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్ తో మరో న్యూ కాన్సెప్ట్ మూవీ టాలీవుడ్ లో చూడొచ్చని అర్థమవుతోంది. మార్చి మూడో వారం నుంచి “భాగ్ సాలే” రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు. “భాగ్ సాలే” చిత్రానికి ఎడిటింగ్ – సత్య గిడుటూరి, సినిమాటోగ్రఫీ – సుందర్ రామ్, ఆర్ట్ – పురుషోత్తమ్, పీఆర్వో – జీఎస్కే మీడియా.

PRO; GSK MEDIA

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES