అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంలో సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం సురాపానం ( కిక్ అండ్ ఫన్ ).

513


తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ తో పాటు వినోదాన్ని కూడా అందించడానికి పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సందర్బంగా సురాపానం సినిమా మోషన్ పోస్టర్ ని శ్రీయుత గౌరవనీయులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ ( ఎం.పీ, రాజ్యసభ సభ్యులు ) గారి చేతుల విడుదల చేశారు. సురాపానం మోషన్ పోస్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారని ,సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, ఘన విజయాన్ని సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్ట మధు యాదవ్, మట్ట రాజు యాదవ్ , సంపత్ కుమార్ గార్లతో పాటు పులిగిల్ల మధు, రవి , సీతారాం, సంతోష్ యాదవ్, లింగరాజు, విద్యాసాగర్ , నవీన్ కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.