హీరోయిన్ పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ‘సుందరి’. అర్జున్ అంబటి హీరోగా నటించారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాంచారు. ఆగస్ట్ 13న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రిజ్వాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ…
– సినిమా ఇండస్ట్రీలో జర్నీ చాలా బావుంది. అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. ‘సుందరి’ సినిమాను నార్మల్‌గానే స్టార్ట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుందని మేం అనుకోలేదు. పూర్ణగారు యాడ్ అయ్యాక, అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. సెన్సార్ పూర్తై యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఆగస్ట్ 13న సినిమాను విడుదల చేస్తున్నాం.
– ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. దర్శకుడు కళ్యాణ్ జి.గోగణ సినిమాను చక్కగా తెరకెక్కించారు. సుందరి అనే పాత్ర కోసం చాలా అన్వేషించాం. హిందీ హీరోయిన్స్‌ను కూడా అప్రోచ్ అయ్యాం. సినిమా కోసం డైలాగ్స్ తక్కువగా మాట్లాడి, ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే హీరోయిన్ కావాలి. కథ అలా డిమాండ్ చేసింది. అలాంటి సమయంలో పూర్ణగారిని కలవడం, ఆమె ఓకే చెప్పడంతో సినిమాను స్టార్ట్ చేశాం.
– కళ్యాణ్ జి.గోగణ చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. అప్పటికే తన తో ట్రావెల్ అయ్యుండటం వల్ల తనెలా సినిమాను తీస్తాడనే విషయం బాగా తెలుసు. దాంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాం. చిన్న లైనే.. కానీ ఎవరూ టచ్ చేయలేదని చెప్పగలను. పూర్ణ పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. అదే అందరికీ కనెక్ట్ అవుతుంది.
– సినిమా అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాం. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. పూర్ణ పాత్రతో ఆడియెన్స్ ట్రావెల్ అవుతారు. అనుకున్న పాయింట్‌ను డిఫరెంట్ క్లైమాక్స్‌తో తెరకెక్కించాం. సినిమా బోల్డ్‌గా ఉండదు. దర్శకుడు కళ్యాణ్‌గారు చెప్పిన దానికంటే ఇంకా బాగా తీశాడు.
– సురేశ్ బొబ్బిలిగారు అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. పాటలు, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి.
– ఓటీటీలు సినిమాలు చూసి బావుంటే హక్కులను కొంటున్నారు. అయితే నిర్మాత ఖర్చు పెట్టినంత ఇవ్వడం లేదు. బడ్జెట్‌లో సగం కంటే తక్కువకు ఇస్తావా! అంటున్నారు. ఇలా అయితే కొత్త నిర్మాతలు ఎలా వస్తారు. అందరూ పెద్ద నిర్మాతలే ఉండాలనుకుంటే కష్టం కదా. అందరికీ అవకాశాలు రావాలి.
– ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌దేవ్‌గారి ‘సూపర్‌మచ్చి’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ నెలలోనే విడుదల ఉండొచ్చు. డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. అందరరూ సహకరిస్తే.. నిర్మాతలుగా ముందుకు వెళతాం. అలాగే సప్తగిరిగారితో ఓ సినిమా అనుకున్నాం. ఆయన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే, వచ్చే నెలలో మా సినిమాను స్టార్ట్ చేస్తారు. అలాగే రెండు పెద్ద సినిమాలను ప్లాన్ చేశాం. దాంతో నిర్మాతలుగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటామని అనుకుంటున్నాం.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385