రవీంద్రభారతిలో శృతి లయ ఆర్ట్స్ అకాడెమీ & సీల్ వెల్ కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రముఖ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్, శ్రీ పాండురంగారావు,శ్రీ మహమ్మద్ షరీఫ్, శ్రీ బాబ్జీ, శ్రీ పల్లె రవికుమార్, శ్రీ మామిడి సోమయ్య, శ్రీ రజనీకాంత్, శ్రీ ఖలీద్ గార్లకు పాత్రికేయ శిరోమణి పురస్కారాలు ప్రదానం చేశారు.లయన్ వై కె నాగేశ్వరరావు సభాధ్యక్షులుగా,కళ పత్రిక సంపాదకులు డా మహ్మద్ రఫీ, శ్రీ కుసుమ భోగరాజు, శ్రీ కె హరి నారాయణ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.తొలుత సంస్థ సారథి ఆమని సారధ్యంలో వెంకట్రావు, సుభాష్, ప్రసన్న గార్లు సుశీల సంగీత విభావరి అత్యంత రమణీయంగా నిర్వహించారు.శ్రీ తులసి రామ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
రవీంద్రభారతిలో శృతి లయ ఆర్ట్స్ అకాడెమీ పురస్కారాల
RELATED ARTICLES