*పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన

344

 

పవన్ కళ్యాణ్ హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, “యధా కాలమ్.. తధా వ్యవహారం” అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం అగుపిస్తుంది. కథా బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ తమ 9 వ చిత్రం గా ప్రకటించిన ఈ చిత్రానికి వక్కంతం వంశి రచయిత.