HomeTeluguనవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న" శ్రీ శ్రీ శ్రీ రాజావారు"

నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు”

చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ గా రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో నవంబర్ 28 న ప్రేక్షకులకు ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ నవంబర్ 28 న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్, పి అర్ ఓ: బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: CH. V. శర్మ, రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి, రచన – దర్శకత్వం: సతీష్ వేగేశ్న


Veerababu PRO
9396410101

RELATED ARTICLES

LATEST ARTICLES

Ramam Raghavam Movie Review

ALL CATEGORIES