హైదరాబాద్ లో తొలిసారిగా భారీఎత్తున శ్రీ శక్తి మహోత్సవములు (శరన్నవ రాత్రుల వైభవం)

47

స్వస్తశ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తేదీ 15.10. 2023 ఆదివారం నుండి ఆశ్వయుజ నవమి తేదీ 23.10.2023 సోమవారం వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 9-30 గంటలవరకు కె పి ఎచ్ పి వద్ద గల కైతలాపుర్ గ్రౌండ్స్ లో దసరా పండుగ సందర్భంగా, ఇప్పటి వరకు జరుగనటువంటి శ్రీ శక్తి మహోత్సవాలు తొలిసారిగా హైదరాబాద్ మహా నగరంలో ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సమస్త ప్రజానీకానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఆహ్వానం పలుకుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు.

తొమ్మిది రోజులు ప్రత్యేక హోమ కార్యక్రమాలు, సేవలు, కల్యాణాలు
యాగ బ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ హోతా సతీష్ కృష్ణ శర్మ గారి బ్రహ్మత్వంలో, జోతిష్య విద్యా విశారద శ్రీ ఆది వారాహి ఉపాశక శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ రావు గురూజీ ఆధ్వర్యంలో ప్రతీరోజు ప్రత్యేక హోమాలు జరుపబడును. హోమాలు వివరాల్లోకెళితే శ్రీ లక్ష్మి గణపతి హోమం, రుద్ర యమలోక్త పాశుపత మహా మన్యు సూక్త పారాయణ హోమం, దశమహావిద్య హోమం,ఆదిత్యాది నవగ్రహ ఆరాధనా హోమం, చండీ హోమం, శ్రీ ఉచ్చిష్ట మహాగణపతి హోమం, శ్రీ సూక్త హోమం, సరస్వతి హోమం, సామూహిక అక్షరాభ్యాసాలు, నవదుర్గ పల్లకీ సేవలు, శ్రీ చక్రనవావరణ అర్చన, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం, కామ్యవృషోగజనమ్ (గో కళ్యాణం) మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడును.

తొమ్మిది రోజులు ప్రత్యేక హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పూజ, దాండియా కోలాటాలు
ప్రతీ రోజు బతుకమ్మ ఉయ్యాల పాటలతో గౌరీ దేవి పూజలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన సంగీతంతో దాండియా, మన తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు, కేరళ, కర్ణాటక, మహా రాష్ట్ర, బెంగాలీ, వంటి భిన్న సంసృతి కలిగిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సినీ, టివి రంగానికి చెందిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించుటకు భారత్ లో నెంబర్వన్ ఈవెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా
భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుంది.

ప్రత్యేక పూజలలో, హోమం లో పాల్గొనదలచినవారు మేము పంపే డిజిటల్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకుని టికెట్ పొందే అవకాశం కలదు. స్టాల్ల్స్ మరియు మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ : 84660 12345, వాట్స్ యాప్ నెంబర్ : 9666026666 కు సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు మా వెబ్ సైట్: www.srishakthimahotsavam.com లాగ్ ఇన్ కాగలరు.