HomeTeluguశ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో మరో కొత్త సినిమా షూటింగ్ షూరు ;-

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో మరో కొత్త సినిమా షూటింగ్ షూరు ;-

తల్లాడ సాయి కృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ లు గా ప్రొడక్షన్ నం.4 సినిమా ప్రారంభం. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా గతంలో ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్, లాంటి సినిమాలు చేసిన సంస్థ ప్రస్తుతం ఒక సినిమాని పూర్తి చేసిన సమయంలో మరొక కొత్త కథ తో ఇంకొక కొత్త సినిమా ప్రొడక్షన్ నం:4 షూట్ చేస్తున్నట్లు నిర్మాత తల్లాడ శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా సాధ్యమైనంత వరకు మేము మంచి మంచి కథ అంశాలతో సినిమాలు నిర్మిస్తూ చిత్ర పరిశ్రమలో మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

దర్శకుడు మరియు హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మేము ప్రొడక్షన్ నంబర్ .4 ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.మంచి కథ మంచి టీం కుదిరింది. త్వరలో రెగ్యులర్ షూట్ ని మొదలు పెడతాం అని సాయి కృష్ణ తెలిపారు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా.ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు ఎంతోమంది ఆడిషన్స్ చేయగా ,నా పర్ఫార్మెన్స్ డెడికేషన్ నచ్చడంతో ప్రొడక్షన్ నం.4 లో హీరోయిన్ పాత్రకి నన్ను ఎంపిక చేశారు.కేవలం కథ మాత్రమే ఈ సినిమాని నడిపిస్తుంది అని అన్నారు.

 

Technicieans

కథ రచన – రమేష్ వెలుపుకొండ,.

రచన సహకారం- శివ కాకు,సంగీతం- పవన్ ,
కెమేరా- ఆర్.ఎస్ శ్రీకాంత్,నేపథ్యం సంగీతం –
వి.ఆర్.ఏ ప్రదీప్
ఆర్ట్ ;- పవన్ యాటగాని, సైదులు
ఎడిటింగ్-శ్రీకాంత్ కురెళ్లి,
గ్రాఫిక్స్ – రాహుల్, పబ్లిసిటీ డిజైన్స్- కార్తీక్ కోరుమిల్లి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES