`శ్రీ‌కారం`లాంటి మంచి సినిమాల‌కి, త‌ప్ప‌కుండా అండ‌గా నిలుస్తాం – మినిస్టర్ కేటీఆర్.

599

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రం హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్‌, ప‌ర‌శురాం, ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర, హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, నార్ల శ్రీనివాస్ రెడ్డి, రైటర్ సాయి మాధవ్ బుర్రా, డీఓపీ యువరాజ్, పాటల రచయిత భరద్వాజ తదిత‌రులు పాల్గొన్నారు.

ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ.. ‘శ్రీకారం నాకు ప్రత్యేకమైన సినిమా. ఇంత మంచి సినిమాలో నేను భాగస్వామ్యం అవ్వడం గర్వంగా సంతోషంగా ఉంది.. ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను.. నా హృదయానికి ఎంతో దగ్గరైన కథ ఇది. కేవలం వ్యవసాయం కోసమే కాదు.. అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. మీరు సినిమా చూడండి.. మీకు నచ్చుతుందని పందెం కాస్తున్నాను. ఇలాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నార’ని చెప్పుకొచ్చారు.

ఒకే ఒక్క పోస్ట్ వేయండి..
చిత్ర ద‌ర్శ‌కుడు కిషోర్‌.బి మాట్లాడుతూ.. ‘యూట్యూబ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ వరకు తీసుకొచ్చారు నిర్మాతలు. ఇప్పటికే వారి గురించి చాలా సార్లు మాట్లాడాను. అమ్మా నాన్నరామ్ గోపీ గారి గురించి మాట్లాడటం కంటే ఫీలవ్వడం ఇష్టం. కథ రాసుకోవడం ఈజీ.. నా కథను జీవితంగా మార్చేశారు. శర్వాకు థ్యాంక్స్. ఆ జీవితానికి మెట్లు కేశవులు పాత్ర.నేను ఎంతో మంది రైతులను చూశాను.. ఆ అందరినీ కేశవుల పాత్రలో దాచిపెట్టాను.. ఈ కథను సినిమా తీసేందుకు ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు. డీఓపీ యువరాజ్ అన్నా.. నువ్ నాకు తోడువచ్చావ్.. మిక్కీ గారు అద్భుతైమన సంగీతం ఇచ్చారు. ఆర్ట్ డైరక్టర్, డైరెక్టర్ టీం.. ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్స్. డెబ్యూ డైరెక్టర్ రావాలంటే వీరందరి సహాకారం వల్లే సాధ్యమవుతుంది. నా క్యారెక్టర్ పుట్టిందే నా చుట్టూ ఉన్న మనుషుల నుంచి. ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే.. మీరు (ఆడియెన్స్) చూసిన తరువాత మాట్లాడిన మాటలే కరెక్ట్‌గా ఉంటాయి. మార్చి 11న సినిమాను చూడండి. చూసిన తరువాత సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోస్ట్ వేయండి.. నచ్చితే వేయండి. న చ్చకపోయినా వేయండి’ అని అన్నారు.

ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. డైనమిక్ లీడర్ సోసైటీలో, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందిస్తూ ఉండే కేటీఆర్ అన్నకు స్వాగతం. మీరెప్పుడూ కూడా మా ఇండస్ట్రీకి అండగా ఉన్నారు. శ్రీకారం సినిమా చూశాను వర్షం పడేటప్పుడు వచ్చే మట్టివాసనలా ఈ సినిమా ఉంటుంది.. యాక్టర్, డాక్టర్ అవ్వాలని ఎంతో మంది అనుకుంటారు కానీ ఎందుకు రైతు అవ్వాలని అనుకోవడం లేదని నేరుగా ప్రశ్నించే సినిమా ఇది. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను కానీ.. కోట్ల మంది హృదయాలను తడుపుతుంద’ని అన్నారు.

శ్రీకారం లాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు..
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన కేటీఆర్‌కు థ్యాంక్స్.. తీరిక లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్స్. ఈ కథే ఆయన రావాలని కోరుకుంది. ఈ చిత్రంలో యూత్‌ తలుచుకుంటే ఏం చేయగలరో చూపించాం.. కేటీఆర్ ఓ యూత్ ఐకాన్. ఆయనలాంటి వారు ఒకరు వచ్చి మాట్లాడితే.. అందరూ వింటారని నమ్మకం.. వ్యవసాయం ఎంత ముఖ్యమైందనేది చూపించాం. ఇది తండ్రి బాటలో నడిచే కొడుకు కథ.. అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. కాస్త ప్రేమ.. నవ్వించే విలన్.. ఏడిపించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. వీటన్నంటిని చుట్టూ తిరిగే నా క్యారెక్టర్. ఈ కథ విన్నప్పుడే ఈ సినిమా చేయడం నా బాధ్యత.. సినిమా చేయాలి అని అనుకున్నాను. ఈ సినిమాను మీ అందరూ చూడాలి.. అది మీ బాధ్యత.. ఓ మంచి పని చేస్తే చెప్పు నేను ఉన్నాను అని కేటీఆర్ గారు అన్నారు. అందుకే కేటీఆర్ అన్నకు థ్యాంక్స్ చెప్పలేను. ఆయనకు ఓ మెసెజ్ పెట్టాను. ఏంటి శర్వా అని వెంటనే ఫోన్ చేశారు. అలా ఫోన్ రావడంతో షాక్ అయ్యాను. ఇలా వెంటనే రియాక్ట్ అయ్యే నాయకుడు ఎవ్వరూ లేరు. ఇండియాలో ఇలాంటి పొలిటీషియన్ లేడు. కథను కిషోర్ రాస్తే ప్రాణం పోసింది సాయి మాధవ్ బుర్రా. ప్రతీ డైలాగ్ ఎంతో గొప్పగా రాశారు.. మిక్కీ జే మేయర్ మంచి పాటలు అందించారు. నటీనటులందరూ ఎంతో గొప్పగా నటించారు. వెనకలా శ్రీవారి మెట్లు, కొండలు, ఆ అందమే వేరు.. డీఓపీ యువరాజ్ ఎంతో అద్భుతంగా చూపించారు. 12ఏళ్ల తరువాత మళ్లీ రావు రమేష్‌తో కలిసి నటించాను. మంచి కథతో వచ్చాం.. గమ్యంతో ఆయనా (రావు రమేష్) స్టార్ట్ అయ్యారు, నా ప్రయాణం స్టార్ట్ అయింది. రావు రమేష్, నరేష్ వంటి వారితో చేయాలంటే మంచి కథతోనే చేయాలి. ఈ సినిమా కథ వినడానికి ఆరు నెలలు ఎదురుచూసేలా చేశాను. బిజీగా ఉండటం వలన వినలేకపోయాను. కానీ పట్టుబట్టి మరీ వినిపించి ఒప్పించారు.. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. కమర్షియల్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఎన్నైనా కొట్టొచ్చు కానీ శ్రీకారం లాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. అలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్.. జై జవాన్ జై కిసాన్..’ అని అన్నారు.

మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలి
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రమ్మని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. చాలా సందర్భాల్లో చాలా రకాలు ఈవెంట్లకు వెళ్తుంటాం. కానీ కొన్నింటికి వెళ్లినప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలా ఇప్పుడు అనిపిస్తోంది. శ్రీకారం టీజర్ చూశాను. ఆ తరువాత 9 నిమిషాల వీడియో చూశాను. హృద‌యంతో ఈ సినిమాను నిర్మించారు.