శ్రీ విజయ రాము పిక్చర్స్ బ్యానర్ పై “బంగారు తల్లి” చిత్రం ప్రారంభం..

224

సంధ్యా వర్శిని, అఖిల్, దేవర్శి ప్రధాన పాత్రల్లో శ్రీ విజయ రాము పిక్చర్స్ బ్యానర్ లో ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బంగారు తల్లి” సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నటుడు బాబు మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు రాము, శ్రీమతి విజయ లకు ఈ సినిమాతో మంచి విజయం చేకూరాలని ఆయన కోరుకున్నారు. ఈ చిత్ర హీరో, హీరోయిన్ మాట్లాడుతూ… ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఇందులో తనకు నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యా వర్షిణి మాట్లాడుతూ.. ఈ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను.మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సాహిస్తున్న దర్శక. నిర్మాత లకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే పరంగా ఫుల్ కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తామని దర్శకుడు ప్రదీప్ తెలిపారు. కథ కు సంబంధించినంత వరకు ఖర్చు కు ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని నిర్మాతలు తెలిపారు. సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను త్వరలోనే తెలియజెస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు.

నటీనటులు :
A.J.సంధ్యా వర్షిణి, సాహిత్య, సావిత్రి, రత్నశ్రీ, దేవర్షి, అఖిల్ , K.L.N , అపూర్వ, సంధ్యా రాణి, రూప, జగదీష్, శంకర్ మహతి, నాగేంద్ర, శివరాజు తదితరులు…

టెక్నికల్ టీమ్..

నిర్మాత : బొద్దం రాము యాదవ్, శ్రీమతి విజయ
దర్శకత్వం : ప్రదీప్ V.R.A
కెమెరా : లక్ష్మణ్
ఫైట్స్ : డైమండ్ వెంకటేష్
ఎడిటింగ్ : సాయి కుమార్ ఆకుల
కొరియోగ్రఫీ : సుబ్బు

పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్