సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన “గేమ్ ఆన్ ” చిత్రం

389

లూజర్ గా ఉన్న ఒక యువకుడు విన్నర్ ఎలా అయ్యాడు అనే కథాంశంతో అనెక్స్ పెక్టెడ్ ఎలిమెంట్స్ తో ట్విస్ట్ & టర్న్స్ తో సైకాలజికల్,రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం “గేమ్ ఆన్”. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు,రవి కస్తూరి, పమిడి రవితేజలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “గేమ్ ఆన్” చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్,నేహా సోలంకి లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ..ప్రవీణ్ సత్తారు గారు వచ్చి క్లాప్ కొట్టి మమ్మల్ని బ్లెస్స్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.2020 నుండి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ.. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ సినిమా ఇవ్వాలని ఈ స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరిగింది.నేను చెప్పిన కథ నిర్మాతలకు ఎంతో నచ్చింది.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఇండియన్ కోర్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి.యూత్ నుండి పెద్దవాళ్లు వరకు అందరికీ నచ్చేటట్లు ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు.నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మాకు చాలా చక్కగా కుదిరారు..రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేస్తాము.సైకాలజికల్ “గేమ్ ఆన్” తో వస్తున్న ఈ చిత్రం యూత్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాతలు జి. కుమార్ బాబు, మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై “గేమ్ ఆన్” చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాను..ఈ చిత్రంలో యూత్ ను ఆకట్టుకునే అంశాలు చాలా వున్నాయి.ఈ స్క్రిప్ట్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఔట్ ఫుట్ కూడా బాగా వచ్చింది.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా యంగ్ ట్యాలెంటెడ్ పీపుల్స్ దొరికారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.

మరో నిర్మాత పమిడి రమేష్ మాట్లాడుతూ. ప్రస్తుతం యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయి,వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, యంగ్ జనరేషన్ ఎలా ఉండాలి అనే కథాంశంతో ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా కుమార్ బాబు తో కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నాము.నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మా సినిమాకు బాగా సెట్ అయ్యారు.పెద్ద బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ..ఈ గేమ్ ఆన్ చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా.ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి, అనెక్స్ పెక్టెడ్ గా ఇందులో చాలా జరగబోతున్నాయి. ట్విస్ట్ & టర్న్స్ ఇందులో చాలా ఉంటాయి.ఈ సినిమా స్క్రిప్ట్ కొరకు దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డాడు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2022 లో బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.

హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ…ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ వుండే ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మరో హీరోయిన్ వసంతి మాట్లాడుతూ..ఈ సినిమాలో మోక్ష క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

నటుడు కిరీటి మాట్లాడుతూ.. ఈ మధ్య నాకు అన్ని .మంచి క్యారెక్టర్స్ లభిస్తున్నాయి.ఈ మధ్య వచ్చిన డి.జె టిల్లు నాకు మంచి పేరు తీసుకువచ్చింది.ఇప్పుడు నటిస్తున్న “గేమ్ ఆన్” చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు

గీతానంద్ , నేహా సోలంకి , వసంతి, ధామరాజు , ఆదిత్య మీనన్, మధుబాల , సుభలేక సుధాకర్ , యోగి, శీను రాథోడ్ , జెజా, నవీన్ తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాత:- కుమార్ బాబు జి.
సహ నిర్మాత:- పమిడి రవితేజ
రచన,దర్శకత్వం:- దయానంద్
డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ:- అరవింద్ విశ్వనాధన్
మ్యూజిక్ డైరెక్టర్:- అశ్విన్-అరుణ్
ఆర్ట్:-విటల్
డిజైనర్: శ్యామ్
అకౌంటెంట్& క్యాషియర్:- చింతా రమేష్ బాబు
ప్రొడక్షన్ మేనేజర్:- మహేష్ మేక
ప్రొడక్షన్ డిజైనర్:- దిలీప్ జాన్
PRO – వంశీ – శేఖర్, మధు
ఫైట్స్:- రామక్రిష్ణ
స్టిల్స్:- గుణ
కొ-డైరెక్టర్: N.స్వరాజ్
అసోసియేట్ డైరెక్టర్:- సంజయ్ తలారి
అసిస్టెంట్ డైరెక్టర్స్:- శివకృష్ణ వెలగ, వై. మురళి క్రిష్ణ
కాస్టూమ్స్ :- మనోజ్
మేకప్:- సాయి