SR కళ్యాణమండపం – Est. 1975‘ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం లోని పాటలు ఏంతో బజ్ ను క్రియేట్ చేశాయి ,అలాగే టీజర్, ట్రైలర్స్, ద్వారా ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ తెచ్చుకొంది. మధ్యతరగతి జీవితాల తండ్రి ఏలా ఉంటాడనేటటువంటి సన్ రిలేషన్స్ కథతో ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తులసి శివమణి నటీనటులుగా
నూతన దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్రమోద్, రాజు లు నిర్మి చిన చిత్రం ‘ SR కళ్యాణమండపం – Est. 1975. ‘ఈ చిత్రాన్ని శంకర్ పిక్చర్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అందరి ఎక్స్ పేక్టేషన్స్ ను నిజం చేస్తూ ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది “SR కళ్యాణమండపం – Est. 1975′ . ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు శనివారం నుండి మరిన్ని థియేటర్స్ పెంచడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసి… కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని సినీ పాత్రికేయులతో పంచుకుంది. అనంతరం
చిత్ర నిర్మాతలు ప్రమోద్,రాజులు మాట్లాడుతూ ..మా సినిమాను చూసిన ప్రతి తండ్రి,కొడుకులు మా సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడం తో నిన్నటి నుండి మరిన్ని థియేటర్స్ పెంచాము.ఓవర్ సీస్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కిరణ్ అబ్బావరం యాక్టింగ్ ను అందరూ ఆఫ్రిసియేట్ చేస్తున్నారు. దర్శకుడి సహకారంతో మేమంతా పిక్నిక్ వెళ్లి వచ్చినట్లు చాలా జాలీగా సినిమాను పూర్తి చేశాము. నాకు ఇష్టమైన నటుడు సాయికుమార్ గారి సపోర్ట్ మరవలేము.భవిష్యత్తు లో కిరణ్ తో మరిన్ని సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాము. మాకింత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ… కిరణ్ అబ్బావరం ఈ సినిమాలో నటించడమే కాకుండా.. ఆడియెన్స్ ఎటువంటి క్యారెక్టర్ చేస్తే రిసీవ్ చేసుకుంటారని భావించి తన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకోని కష్టపడి ఈ సినిమా కథ రాసుకున్నాడు. తన సినిమా ద్వారా ఎవరూ నష్టపోకూడదు అని మంచి దర్శక, నిర్మాతలతో కొలబ్రెట్ అయ్యి వారందరూ కలసి అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు.ఇలాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం. అలాగే వీరి టీం మీద నమ్మకంతో మేము దైర్యం చేసి ఈ సినిమాను విడుదల చేశాము. అన్ని ఏరియాల నుండి సినిమా బాగుందని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ …ఈ సినిమాలోని సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలు ఇంత బాగా వచ్చాయి అంటే దానికి ముఖ్య కారణం భాస్కరభట్ల, క్రిష్ణ కాంత్, హీరో,దర్శక నిర్మాతలే వీరందరి సపోర్ట్ తో పాటలు చాలా బాగా వచ్చాయి అని అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ. 25 సంవత్సరాల క్రితం కథను నమ్ముకొని చేసిన పోలీస్ స్టోరీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ తరువాత అంతే పెద్ద హిట్ అయిన సినిమా “SR కళ్యాణమండపం EST 1975.. ఇది నాకు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది. చాలా చోట్ల నుండి సినిమా చాలా బాగుందని ఫోన్ కాల్స్ వస్తున్నాయి.తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా ఒక విజయం శుభ సూచికం లాంటిది. ఈ సినిమా తరువాత చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి పెద్ద విజయం అందించారు అని అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. థియేటర్స్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అందరూ ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ లో కూడా మమ్మల్ని నమ్మి మా సినిమా విడుదల చేసినందుకు వారందరికీ పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.. ఫ్యామిలీస్ అందరూ వచ్చి మా సినిమా చూస్తున్నారు. చాలా మంది కొడుకులు వల్ల నాన్న పై ఉన్న ప్రేమను వ్యక్త పరచలేరు. ఈ సినిమా ద్వారా మాలోని ఆలోచనలను మీరు కళ్ళకు కట్టినట్లు చూపించారని చాలా మంది నాకు ఫోన్స్ చేసి కంగ్రాట్స్ చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసిన ప్రతి ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ లో కూడా మా సినిమా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాదించడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
తారాగణం –
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్. తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
వరల్డ్ వైడ్ రైట్స్ – శంకర్ పిక్చర్స్
నిర్మాతలు – ప్రమోద్, రాజు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కిరణ్ అబ్బవరం
దర్శకుడు – శ్రీధర్ గాదే
సంగీతం – చేతన్ భరద్వాజ్
కెమెరా – విశ్వాస్ డేనియల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ – భరత్
లిరిక్స్ – భాస్కరభట్ల, క్రిష్ణ కాంత్
ఆర్ట్ – సుధీర్
డిఐ – సురేశ్ రవి
ఫైటర్ – శంకర్
పి.ఆర్.ఓ – ఏలూరుశ్రీను, మేఘశ్యామ్
—
Eluru Sreenu
P.R.O