సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం

510

* ‘నరుడి బ్రతుకు నటన’ గా చిత్రం పేరు ఖరారు
* ఆకర్షణీయమైన లోగోతో కూడిన ప్రచార చిత్రం విడుదల
* దీపావళి కి షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ కలసి నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో’ రూపొందనున్న ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు.
చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..వేచి చూడాల్సిందే…! చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాల కోసం నిర్మాణ సంస్థకు సంబంధించిన సామాజిక మాధ్యమం ఖాతాను గమనిస్తూ ఉండండి.

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో,నిర్మాతసూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది దీపావళి కి ప్రారంభం అవుతుంది.
‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ