HomeTeluguసితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యాడెస్ట్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' నుంచి మొదటి పాట 'ప్రౌడ్సే' విడుదల

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యాడెస్ట్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ నుంచి మొదటి పాట ‘ప్రౌడ్సే’ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మునుపెన్నడూ చూడని తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి సిద్ధమవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాతో సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయమవుతున్నారు.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పై సాయి సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ధమాకా వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మ్యాడ్ సినిమా నుంచి సెప్టెంబర్ 14న “ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్” అనే సింగిల్స్ గర్వించదగిన గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా.. సింగిల్ గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. ‘ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్’ పాట సంగీతం ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఇక సాహిత్యం యువత మెచ్చేలా.. ముఖ్యంగా లింగభేదాలు లేకుండా ప్రతి యొక్క సింగిల్ ని కట్టిపడేసేలా ఉంది.

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్’ పాట ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తారాగణం & సాంకేతిక నిపుణుల వివరాలు:

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఫైట్ మాస్టర్: కరుణాకర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES