“సిరివెన్నెల ” ఆడియో లాంచ్‌

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

492

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ శ‌నివారం ఆర్‌.కె.మ‌ల్టీ ప్ల‌క్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

వైవిఎస్ చౌద‌రి మాట్లాడుతూ… చాలా మంది మ‌హానుభావులు ఇక్క‌డ‌కి వ‌చ్చారు. మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావుగారు. నేను ఎంతో ఇష్ట‌ప‌డే నాతో ఎన్నో సినిమాలు చేసిన భాషా. సినిమా నిర్మించ‌డం, విడుద‌ల చెయ్య‌డం ఎన్నో డ‌బ్బులు ఎంతో ప్రాబ్ల‌మ్స్‌. ఎన్నో లుక‌లుక‌లు ఇవ‌న్నీ సినిమా రంగంలో చూసి చూసి వ‌చ్చారు భాషా. అన్నీ ప‌నులకు డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టి తీరా సౌండింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి డ‌బ్బులు అయిపోవ‌డం అనేది చాలా సార్లు చూశాం. అలాంటివ‌న్నీ చూసి త‌ను ప్రొడ్యూస‌ర్‌గా మొద‌టి ప్ర‌య‌త్నం ఈ సినిమా ఆయ‌న‌కి కీర్తి క‌న‌కం తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ… మీ తాతయ్య న‌వ్వించేవారు నువ్వు భ‌య‌పెడుతున్నావు. మ‌హాన‌టితో స్టార్ట్ చేశావ్. మ‌న స‌క్సెస్ క‌న్నా మ‌న పిల్ల‌ల స‌క్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. భాషాకి రాజ‌మౌళి తెలుసు, రాఘ‌వేంద్ర‌రావు తెలుసు అంద‌రితోనూ ప‌ని చేశారు. నా సినిమాల‌కు చాలా వ‌ర‌కు ఆయ‌నే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఒక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేక పోతే సినిమానే లేదు. క‌మ‌ల్‌గారు మీరు చాలా క‌రెక్ట్ ప‌ర్స‌న్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు. ప్రియ‌మ‌ణి స‌తిసావిత్రిలాగా అటు మోడ్ర‌న్‌, ఇటు ట్రెడిష‌న‌ల్ ఏపాత్ర కైనా సూట్ అవుతుంది. ప్ర‌స్తుతం యాక్ష‌న్ చిత్రం చెయ్య‌డం చాలా బావుంది. అంద‌రికీ థ్యాంక్స్‌. ట్రైల‌ర్ స్టార్టింగ్ జై జై గ‌ణేషా సాంగ్ అన్నారు. ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ… నేను ఈ సినిమాలో ఇంత బాగా క‌నిపించ‌డానికి కార‌ణం ప్ర‌కాష్‌గారు. నేను చెన్నైలో ఉండ‌గా ఓం ప్ర‌కాష్‌, భాషాగారు వ‌చ్చి క‌థ చెప్పారు. నేను ఒక‌రోజు టైం తీసుకుని మా ఇంట్లోవాళ్ళ‌ని అడిగి క‌థ నాకు కూడా న‌చ్చడంతో ఓకే చెప్పాను. ఈ సినిమాతో నా సెఎండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లే. ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. చిన్నారి సాయి త‌న పాత్ర‌లో చాలా బాగా న‌టించింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన భాషాగారికి ఓం ప్ర‌కాష్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.