ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా.. అఆ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లాన అప్పారావు నిర్మించారు. గడ్డం శిరీష, నల్లపు రవీందర్ సహనిర్మాతలు కాగా, సురేష్ బాబు అట్లూరి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లాన అప్పారావు మాట్లాడుతూ.. ‘‘ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా దర్శకుడు సురేంద్ర ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తవడమే కాకుండా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకి చేరుకున్నాయి. ప్రస్తుతం చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశాం. దీనికి చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించనున్నాం..’’ అని తెలిపారు.
చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘రస్టిక్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించాము. రియలిస్టిక్ అప్రోచ్ కోసం అంతా కొత్తవారితో ఈ చిత్రం చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా వరకు థియేటర్ ఆర్టిస్ట్‌లనే తీసుకున్నాం. అందరూ అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా ఎంతగానో సహకరించారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్‌కు, ఎడిటర్ ప్రవీణ్ పూడికి, ఇతర సాంకేతిక నిపుణులకు, నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.
అంతా కొత్తవారితో రూపొందిన ఈ చిత్రానికి
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కెమెరా: కన్నా
సహ నిర్మాతలు: గడ్డం శిరీష, నల్లపు రవీందర్
లైన్ ప్రొడ్యూసర్: సురేష్ బాబు అట్లూరి
పీఆర్వో: బి. వీరబాబు
రచన-దర్శకత్వం: సురేంద్ర మాదారపు
—
Veerababu PRO
9396410101