HomeTelugu‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం నుంచి ‘చదువే చదువంటారు..’ లిరికల్ సాంగ్ విడుదల

‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం నుంచి ‘చదువే చదువంటారు..’ లిరికల్ సాంగ్ విడుదల

ఓ అపార్ట్‌మెంట్‌లో కొంద‌రు చిన్న పిల్ల‌లు క‌లిసి ఫుట్ బాల్ ఆడుతుంటారు. అంత‌లో వారి ద‌గ్గ‌రు వారి ఫ్రెండ్ వ‌స్తుంది. ఈ మ‌మ్మీలంతా ఎప్పుడూ చ‌దువు చ‌దువ‌నే అంటుంటారు. పాట గీటా టైమ్ వేస్ట్ అంటారు. అంటూ ఇప్ప‌టి త‌ల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నార‌నే విష‌యాన్ని పాట రూపంలో చ‌క్క‌గా పాడింది. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు? ఎప్పుడూ చ‌దువుకోకుండా అప్పుడప్పుడు ఆట పాట‌ల‌ను నేర్చుకోవాల‌నుని ఎందుకు చెబుతుంద‌నే విష‌యం తెలియాలంటే మే 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత పాపారావు బియ్యాల‌. ఈ సినిమాను హిందీలో పి.వి.ఆర్‌, తెలుగులో ఎస్‌.వి.సి బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై షర్మన్‌ జోషి, శ్రియా శరన్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పక్కా ప్రమోషనల్ ప్లానింగ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోన్న ఈ మూవీ నుంచి బుధ‌వారం (ఏప్రిల్ 5) రోజున ‘చదువే చదువంతా..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పాట‌లో ఇప్ప‌టి విద్యావ్య‌వ‌స్థ ఎలా ఉంది.. దాని వ‌ల్ల పిల్ల‌ల‌పై ఒత్తిడి ఎలా పెరిగి పోతుంద‌నే విష‌యాల‌ను చ‌క్కగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో మొత్తం 11 పాట‌లున్నాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన చ‌దువే చ‌దువంతా అనే పాట‌ను రెహ్మాన రాయ‌గా.. ప్రియ మ‌ల్లి, శ‌ర‌త్ సంతోష్‌, హృతిక్ జ‌య‌కిష్‌, నేహా గిరీష్, ప‌ద్మ‌జ శ్రీనివాస‌న్ ఆర్.ఎస్ పాడారు.

కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుత‌మైన డాన్సుల‌ను కంపోజ్ చేశారు ఆడ‌మ్ ముర్రు, చిన్ని ప్ర‌కాష్‌, రాజు సుంద‌రం. ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన‌, లీలా సామ్‌స‌న్స్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES