శివ కంఠమనేని కథానాయకుడిగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

491

శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్‌. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్‌’ విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా… అశోక్‌ కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు.శివ కంఠమనేని మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు మేం లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్‌. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్‌ థ్రిల్లర్‌! ఇందులో నేను, రాశిగారు లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాం. హీరోయిన్‌గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. రెండు షెడ్యూళ్ళల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పది పదిహేను రోజులు విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్‌ చేశాం. పాటలు విన్న వారందరూ మంచి బావున్నాయని ప్రశంసించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులు అందివ్వాలని మా తాపత్రయం’’ అని అన్నారు.

రాశి మాట్లాడుతూ ‘‘చాలా గ్యాప్‌ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్‌, ఇండిపెండెంట్‌ విమెన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్‌ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.