HomeTelugu`షికారు` నుంచి యూత్ ఫుల్ క్రేజీ సాంగ్ విడుద‌ల - జూన్ 24న సినిమా రిలీజ్‌

`షికారు` నుంచి యూత్ ఫుల్ క్రేజీ సాంగ్ విడుద‌ల – జూన్ 24న సినిమా రిలీజ్‌

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన షికారు నుండి `దేవ‌దాసు పారు వ‌ల్ల బ్యాడు` అనే క్రేజీ సాంగ్‌ను చిత్ర బృందం శ‌నివారంనాడు ఫిలింఛాంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విడుద‌ల‌చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌కుమార్‌, నిర్మాత వివేక్ కూచిభ‌ట్ట‌, ఆదిత్య మ‌హేంద్ర‌, చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా న‌టుడు చ‌మ‌క్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం త‌ర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీక‌రించారు. అది నేను ఊహించ‌లేదు. ఇందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. నేను కేరెక్ట‌ర్ చేస్తుండ‌గానే పాట కూడా చేయించాల‌నే ఆలోచ‌న వారికి వ‌చ్చింది. నాపై తీసిన సాంగ్ యూత్‌ఫుల్ సాంగ్‌. యూత్‌ను ఆక‌ట్టుకునేందుకు వైవిధ్యంగా చిత్రించారు. ఈ సినిమా చేస్తుండ‌గానే నాకు పూర్తి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈనెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చూసి ఆనందించండి అని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రి కొల‌గాని మాట్లాడుతూ, నేను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను బ‌లంగా న‌మ్మే వ్య‌క్తిని. ఓ సాంగ్ ద్వారా యూత్‌కు మెసేజ్ చెప్పాల‌నిపించింది. పాట‌ను రాయాల‌ని న‌లుగురు గీత‌ర‌చ‌యిత‌ల‌ను అనుకున్నాం. కానీ నా ఐడియాకు సింక్ కాక‌పోవ‌డంతో పాట ఇలా వుండాల‌ని వారికి చెప్పేందుకు రాస్తుండ‌గా ఆటోమేటిక్‌గా పూర్తి పాట రాసేశాను. జూన్ 24న సినిమా విడుద‌ల కాబోతోంది. క‌చ్చితంగా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. నాకు మొద‌టి సినిమాగా అవ‌కాశం ఇచ్చిన బాబ్జిగారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

న‌టుడు, నిర్మాత డి.ఎస్‌.రావు మాట్లాడుతూ, ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. మేకింగ్‌లో వుండ‌గా వెళ్ళాను. చ‌మ‌క్‌చంద్ర‌కు సాంగ్ ఇచ్చార‌ని తెలుసుకున్నాక అసూయ ప‌డ్డాను. త‌న‌కు చాలా పెద్ద పాత్ర ఇచ్చారే అనిపించింది. కానీ ఆయ‌న చేస్తున్న న‌ట‌న నా ఆలోచ‌ను మార్చేసింది. ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు తానే చ‌మ‌త్కారంగా రాశాడు. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

వివేక్ కూచిభ‌ట్ట మాట్లాడుతూ, పంపిణీదారుడిగా వైజాగ్‌లో బాబ్జీగారు ప‌లు చిత్రాలు చేశారు. ఇప్పుడు నిర్మాత‌గా సినిమా చేశారు. నేను చూశాను. చాలా బాగుంది. సెకండాఫ్‌లో బాల‌య్య‌బాబుగారి ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా వుంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. చిత్ర టీమ్‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పారు.

ఆదిత్య మ్యూజిక్ మ‌హేంద్ర మాట్లాడుతూ, బాబ్జీగారు మంచి క‌థ‌ను ఎన్నుకున్నారు. సాంగ్స్‌ప‌రంగా మాకు నెరేట్ చేశారు. ఇది యూత్‌ఫుల్ సినిమా. శేఖ‌ర్ చంద్ర బాణీలు బాగున్నాయి. భాస్క‌ర‌భ‌ట్ట మూడు పాట‌లు రాశారు. చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రి కొల‌గాని ఓ పాట రాశారు. చిత్రం విజ‌యవంతం కావాల‌ని ఆకాంక్షించారు.

చిత్ర నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, నేను చాలా క‌థ‌లు విన్నాను. రాజ్‌త‌రుణ్‌తో సినిమా తీయాల‌ని వ‌చ్చాను. కానీ ఈ క‌థ విన్నాక అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఐదు నిముషాల్లో క‌థ‌ను ఓకే చేశా. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. స‌మాజంలో జ‌రుగుతున్న ఇష్యూను ఫ‌న్‌గా తీశాం. అందుకే అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్ అని పెట్టాం. ఏదైనా సినిమాలో ఒక‌టి, రెండు పాట‌లు బాగుంటాయి. కానీ మా సినిమాలో అన్ని పాట‌లు అద్భుతంగా వున్నాయి. `మ‌న‌సు దారి త‌ప‌ప్పినే` సిద్ద్ శ్రీ‌రామ్ పాడిన పాట పాపుల‌ర్ అయింది. `ఫ్రెండ్‌షిప్‌`పై రాసిన రెండో పాట కూడా అంతేరీతిలో వుంది. ఈరోజు విడుద‌ల‌చేసింది మూడోపాట‌. ఇది కూడా ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం ముంది. పాట‌లో చ‌మ‌క్క్ చంద్ర జీవించాల‌ర‌నే చెప్పాలి. ఆయ‌న కామెడీ టైమింగ్ వేరే లెవ‌ల్‌లో వుంటుంది. ఆర్టిస్టులంతా బాగా న‌టించారు. సాంకేతిక సిబ్బంది బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌స‌న్న‌కుమార్‌గారు నాకు చాలాకాలంగా మిత్రులు. చాలా విష‌యాల్లో స‌పోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమా టైటిల్ విష‌యంలో నేను, ద‌ర్శ‌కుడు త‌ర్జ‌న‌భ‌ర్జ‌లు ప‌డుతుండ‌గా ప్ర‌స‌న్న‌గారిని క‌లిసి వివ‌రించాం. నేను షికారు అని ఫిక్స్ అయ్యాను. ఆ విష‌యం ప్ర‌స‌న్న‌గారికి చెప్ప‌గానే ఈ పేరుతో గ‌తంలో ఓ నిర్మాత రిజిష్ట‌ర్ చేసి సినిమా విడుద‌ల‌చేయ‌లేద‌ని తెలుసుకుని ఆయ‌న‌చేత ఒప్పించి మాకు టైటిల్ ఇచ్చేలా స‌హ‌క‌రించారు. ఇందుకు ఆయ‌న‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. షికారు సినిమా జూన్ 24న విడుద‌ల‌వుతుంది. యూత్‌ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి అని తెలిపారు.
ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ, పంపిణీదారుడిగా, నిర్మాత‌గా మంచి నిబ‌ద్ధ‌త‌తో కూడిన వ్య‌క్తి బాబ్జీగారు. ఆయ‌న తీస్తున్న సినిమా యూత్‌తోపాటు ఫ్యామిలీస్ చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. `ఇందులోనేను చేసిన పాట‌ను యూత్‌లో ఒక వ‌ర్గానికి బాగా న‌చ్చుతుంద‌ని` కొరియోగ్రాఫ‌ర్ సుభాష్ తెలియ‌జేశారు.

న‌టీన‌టులుః సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర, క‌న్న‌డ కిశోర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు
సాంకేతిక‌త‌- నిర్మాతః పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌), క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః హ‌రి కొల‌గాని, స‌హ నిర్మాతః సాయి ప‌వ‌న్ కుమార్‌, కెమెరాః వాసిలి శ్యాంప్ర‌సాద్‌, డైలాగ్స్ః విశ్వ క‌రుణ్‌, పి.ఆర్‌.ఓ.- వంశీ శేఖ‌ర్‌, తేజు. ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌- ధ‌నియేలే.

 PRO,
Tejaswi Sajja

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES