దస‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 23న శ‌శిక‌ళ ఎంట‌ర్ టైన్మెంట్స్ లింగొచ్చా చిత్ర టీజ‌ర్

434


శ్రీక‌ల ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై బ్లాక్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో యాద‌గిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా ద‌ర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు, కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. కార్తీక్ కి జోడిగా సుప్యార్దే సింగ్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గుతున్నాయి. అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇటు ఆడియెన్స్ లో లింగొచ్చి అనే టైటిల్ కి అనూహ్య స్పంద‌న రావ‌డం చాలా ఆనందాంగా ఉంద‌ని, ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీజ‌ర్ ను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత యాద‌గిరి రాజు, ద‌ర్శ‌కుడు ఆనంద్ బ‌డా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు.

నటీన‌ట‌లు

కార్తీక్ ర‌త్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, స‌ద్దామ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ – శ్రీక‌ల ఎంటర్ టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ – బ్లాక్ బాక్స్ స్టూడియోస్
డైలాగ్స్ – ఉద‌య్ మ‌దినేని
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – మ‌ల్లేశ్ క‌న్జార్ల‌
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సందీప్ తుమ్కుర్, శ్రీనాధ్ చౌద‌రి
మ్యూజిక్ – బికాజ్ రాజ్
ఎడిటింగ్ – మ్యాడీ, శ‌శిబ‌డా
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
నిర్మాత – యాద‌గిరి రాజు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం – ఆనంద్ బ‌డా