షరీఫ్ మహమ్మద్ కు ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అంతర్జాతీయ అవార్డు,

1159

సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత, దర్శకుడు, రచయిత, నంది, అవార్డుల గ్రహీత షరీఫ్ మహమ్మద్ కు ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ (డబ్ల్యూ.హెచ్.డి) అంతర్జాతీయ అవార్డు, విశ్వగురు జాతీయ కరోనా వారియర్ అవార్డు లభించింది. లండన్ లో ఈనెల 28న వైభవంగా జరిగిన కార్యక్రమంలో ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అవార్డులను ప్రకటించారు. వివిధ దేశాలకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ ఉత్సవంలో ఇండియా విభాగంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ పట్టణానికి చెందిన షరీఫ్ పేరు చోటు చేసుకోవడం గమనార్హం. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను షరీఫ్ కు ఆన్ లైన్ ద్వారా అందజేశారు. ఈ అవార్డుకు ఎంపికైన ఆయన ను ప్రశంసిస్తూ సంస్థ ముఖ్యులు తమ అమూల్య సందేశాలను పంపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నేపాల్ మాజీ ప్రధాని మాధవ్ కుమార్ సైతం షరీఫ్ ను ప్రశంసిస్తూ తన సంతకంతో కూడిన సందేశాన్ని అందజేశారు.కరోనా విపత్తు కారణంగా ఆర్థికంగా ఆపదలో ఉన్నవారికి నిత్యావసర వస్తువుల పంపిణీ, ఆహార పదార్థాలు, అవసరమైన వారికి మందుల పంపిణీ , అవసరమైన జర్నలిస్ట్ లకు నిత్యావసర వస్తువుల పంపిణీని షరీఫ్ మహమ్మద్ చేపట్టిన కార్యక్రమాల వలన ఈ అవార్డులను ఆయన కు ప్రధానం చేశారు. మానవతా విపత్తులను నివారించడం, విపత్తుల బారినపడిన వారికి మద్దతు ఇవ్వడంతో పాటు, వారికి ఉపశమనం అందించడం, ఆరోగ్య రక్షణకు అన్నివిధాలుగా సహకరించిన వారికి అవార్డు లు ఇవ్వడం ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ ఉద్దేశ్యం. తాజాగా ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఆ వైరస్ బారిన పడకుండా సూచనలు ఇవ్వడంతోపాటు, పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ వారిని చైతన్య వంతులను చేసే క్రమంలో ఈ మూడు నెలల కాలంలో తెలంగాణలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు వెయ్యి కుటుంబాలను ఆదుకోవడంలో సామాజిక కార్యకర్త గా, జర్నలిస్టుగా షరీఫ్ చేసిన కృషి మరువలేనిదంటూ డబ్ల్యూ.హెచ్.డి, విశ్వ గురు సంస్థ ప్రశంసలు అందజేసింది . కోవిడ్-19 వల్ల ఇంటికే పరిమితమైన కుటుంబాలకు నిత్యావసరాలు సమకూర్చడం, కోవిడ్ సేవల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో అబ్దుల్ మానవతా ధృక్పథంతో అడుగులు ముందుకేయడం ప్రశంసనీయమని వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ ఫౌండర్ చైర్మన్ డా. అబ్దుల్ బాసిత్ సయ్యద్ ఈ మేరకు తమ సందేశాన్ని అందజేశారు. జాతి, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవులందరిలో శాంతి, సామరస్యం నెలకొల్పి ఒకే కుటుంబంలా జీవించేందుకు హ్యుమానిటేరియన్ డ్రైవ్ చేస్తున్న కృషి మరువలేనిదని ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ అవార్డు గ్రహీత షరీఫ్ అన్నారు. కరోనా కాలంలో ప్రజలను చైతన్యం చేసే క్రమంలో మానవతా ధృక్పథంతో చేసిన సేవలను గుర్తించి హైదరాబాద్ కు చెందిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్య వోలు రాంబాబు, విశ్వ గురు అవార్డు ను ఈ రోజు హైదరాబాద్ లో ప్రదానం చేయడం జరిగింది అని షరీఫ్ మహమ్మద్ పేర్కొన్నారు. ప్రోత్చహించిన డబ్ల్యూ.హెచ్.డికి, విశ్వ గురు సంస్థకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.