Sapbro Productions is excited to announce the completion of filming for their highly-anticipated movie, Shanmukha, which is fronted by Aadi Sai Kumar and Avika Gor.
Directed by Shanmugam Sappani, the film promises to be a visual spectacle featuring grand sets, striking CGI, and a formidable score by the renowned Ravi Basrur.
The movie was shot on some of the largest sets ever built near Hyderabad, providing the perfect backdrop for its epic story.
Said director Shanmugam Sappani, “We have crafted a story that we believe will resonate with audiences, thanks to our talented cast and crew, led by Aadi Sai Kumar and Avika Gor. The film is now moving into post-production, where the focus will be on fine-tuning the visual effects and ensuring the highest quality in every frame.”
Music for the film is composed by the super-talented Ravi Basrur, known for his work on KGF and Salaar. His compositions are a mainstay of this emotional roller-coaster ride.
The post-production is going to help Shanmukha graduate to a superlative level.
The film is produced by Thulasiram Sappani, Shanmugam Sappani, and Ramesh Yadav.
ఆది సాయికుమార్ విజువల్ వండర్ షణ్ముఖ షూటింగ్ పూర్తి
వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివరి షెడ్యూల్‌ను పూర్తిచేసాం. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.