ఆర్.ఎస్ ప్రొడక్షన్ గతంలో ఎన్టీఆర్ తో సుబ్బు చిత్రాన్ని అలాగే సుమంత్ తో మహానంది సినిమాను నిర్మించింది. ఆ తరువాత కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. కథ కథనాలు నచ్చడంతో ఆర్.ఎస్ ప్రొడక్షన్ నిర్మాత ఆర్ శ్రీనివాస్ తెలుగులో సీతన్నపెటగేట్ సినిమాను నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే లవ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.
వేణు గోపాల్, యస్వన్, సురభి తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వై.రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు, ఎన్.ఎస్.పర్సు సంగీతం అందించారు.
ఈ చిత్ర ఆడియో లంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర తో పాటుగా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ…
మంచి టేస్ట్ ఉన్న నిర్మాత ఆర్.శ్రీనివాస్ గారు. తెలుగు కన్నాడలో మంచి సినిమాలు చేస్తూ అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆర్.ఎస్ ప్రొడక్షన్ అంటే కన్నడలో పెద్ద నిర్మాణ సంస్థ ఇప్పుడు తెలుగులో కూడా వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. సీతన్నపేటగేట్ సినిమా ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. డైరెక్టర్ వై.రాజ్ కుమార్ సినిమాను బాగా తీశారు, తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు వై.రాజ్ కుమార్ మాట్లాడుతూ…
సీతన్నపేటగేట్ సినిమాను మేమంతా బాగా నమ్మి తీశాము. ఒక మంచి కథకు కమరిషల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. తప్పకుండా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉంది. హీరో హీరోయిన్లు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు.
నిర్మాత ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ…
సీతన్న పేట గేట్ సినిమా చిత్రీకరణ పూర్తి తరువాత సినిమా చూశాను. నాకు నచ్చింది విడుదల తరువాత ప్రేక్షకులు కూడా ఇదే మాట చెబుతారని ఆశిస్తున్నాను. మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి మా అందరికి మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
నటీనటులు:
వేణు గోపాల్, యశ్వన్, సురభి, అనూష జైన్, తివారి, సాయి కుమార్, పార్థు, గంగాధర్.
టెక్నీషియన్స్:
డైరెక్టర్: వై.రాజ్ కుమార్
నిర్మాత: ఆర్.శ్రీనివాస్
మ్యూజిక్: ఎన్. ఎస్. పర్సు
యాక్షన్: వింగ్చున్ అంజి
కెమెరా: యోగిరెడ్డి
డైలాగ్స్: బయ్యవరపు రవి