HomeTeluguవేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం !

వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ సినిమా ప్రారంభం !

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ ” యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతు

న్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము.” అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ ” సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము.” అన్నారు

“త్వరలోనే షూటింగ్ లో పాల్గోనబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం” అని కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న ఆకాక్షించారు.

రిద్ది కుమార్ , మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Shatamanam Bhavati director Satish Vegesna, known for his clean family entertainers, will be directing Kothi Kommachi, featuring actors Meghamsh Srihari and Sameer Vegesna in the lead roles. Commemorating Vijaya Dasami, the film, being produced by MLV Sathyanarayana under Lakshya Productions, officially went on floors earlier on Sunday.

Leading producer Dil Raju gave the clap for the film’s first shot while actor Allari Naresh switched on the camera for the same. “We’re happy to kickstart the youthful entertainer on a festive note. The schedule will commence in Amalapuram from November 3 and the unit will move to Vizag to shoot a few portions. We hope to complete the film in a single schedule,” director Satish Vegesna stated.

“The pre-production formalities for Kothi Kommachi were wrapped recently. It’s a matter of privilege that a filmmaker like Satish Vegesna is directing a film under our banner. I’m sure Kothi Kommachi will be a memorable film in the careers of Meghamsh and Sameer,” the producer MLV Sathayanarayana said.

“We are very excited about the film and can’t wait for the shoot to commence. I hope the audiences will like our work,” the lead actors Meghamsh Srihari, Sameer Vegesna added. Riddhi Kumar, Megha Chowdhury play female leads in the film that has music by Anup Rubens. Sameer Reddy is cranking the camera for Kothi Kommachi.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES