గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య, ప్రధాన పాత్రదారులుగా సినేటెరియా మీడియా వర్క్స్ పతాకంపై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన ఔట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “సర్వం సిద్ధం”. (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ని హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు..ఈ చిత్రం ఏప్రిల్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత బి వెంకట్ నిర్మించిన `సర్వంసిద్దం` చిత్రం నాన్ స్టాప్ కామెడీతో అలరిస్తుందని ప్రముఖ నటుడు అల్లరి నరేష్ పేర్కొన్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్, సినిమాలో ఉండబోయే కామెడీని సూచిస్తుందని, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యంతో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నట్లు అల్లరి నరేష్ తెలియజేశారు. ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం నవ్వులు కురిపిస్తోందనీ, సినీ రంగంపై అత్తెసరు నాలెడ్జ్ ఉన్న దర్శకుడి చేతిలో సినీ నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్లు పడ్డ అగచాట్లు, మరియు సినిమాలో చూయించిన వెరైటీ రోమాంటిక్ టచ్ కడుపుబ్బా నవ్విస్తోందని ఆయన తెలియజేశారు. హాస్యం ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచిదనీ, ఈ సర్వం సిద్దం చిత్రం కావలసినంత హాస్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసి ఆనందించాలని ఆయన కోరారు.
సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) చిత్ర ట్రైలర్ ను ఆయన విడుదల విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు అంజి శ్రీను, సినిమా నిర్మాతలు శ్రీమతి శ్రీలత బి వెంకట్, వెంకటేశ్వర్లు బులెమోని, దర్శకుడు అతిమల్ల రాబిన్ నాయుడు, సినిమా కథానాయకుడు గోవింద్ రాజు, హెయిర్ క్రియేషన్స్ అధినేతలు వినాయక్, శ్రీమతి రజిని తదితరులు పాల్గొన్నారు.
గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, పూజ, అనుపమ పట్నాయక్, కిరణ్ మెడసాని, త్రిశాంక్, అభిషేక్, రామ్ రోమియో, లావణ్య, యస్వంత్, వెంకటేష్, చరణ్, ఫరీనా, శిరీష, అర్జున్, మధుశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డివోపి; బొబ్బిలి సంతోష్ రెడ్డి, మ్యూజిక్; డేవిడ్ జి, ఎడిటర్; కిరణ్ రెడ్డి యం, నిర్మాత; శ్రీలత బి. వెంకట్, రచన-దర్శకత్వం; అతిమళ్ల రాబిన్ నాయుడు.