‘సర్కారు వారి పాట’ స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఇంటర్వ్యూ

204

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’ కు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలు…

దర్శకుడు పరశురాం గారు ఈ కథ చెప్పినపుడు.. ఇంతకుముందు మీరు చేసిన సినిమాలకి ‘సర్కారు వారి పాట’కి ఎలాంటి తేడా గమనించారు ?

దర్శకుడు పరశురాం గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. నేను చేసిన సినిమాలన్నీటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా వుంటారు. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది.

పోకిరి తర్వాత మహేష్ బాబు గారి చాలా హిట్స్ వచ్చాయి కదా? మరి పోకిరితోనే పోల్చడానికి కారణం ?

పోకిరి నేను ఎడిటర్ గా చేసిన సినిమా. అందుకే పోకిరితో పోల్చాను. పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ట్రాక్ లో తెగ నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ లో వారు ఎక్కడ కలిసిన చిన్న లాఫ్ వుండేది. థియేటర్ లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు
వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుంది. ఎడిటింగ్ కి సంబధించిన విమర్శలని ఎలా తీసుకుంటారు ?
విమర్శ మంచిదే. అయితే అది నిర్మాణాత్మకంగా వుండాలి. పది నిమిషాలు తగ్గించుంటే బావుంటుందని చెప్తారు. ఏం తగ్గించాలో చెప్పరు, ఏ సీన్ బాలేదో చెప్పరు. ఇలా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం. మాకూ కొంచెం హెల్ప్ ఫుల్ గా వుంటుంది.

పెద్ద సినిమాకి చివరి నిమిషం వరకూ ఎడిటింగ్ చేస్తూనే వుంటారు. దానివలన ఒత్తిడిపెరుగుతుందా ?
ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. ఓవర్సిస్ కి మూడు రోజులు ముందే వెళ్ళాలి. అంటే నాలుగు రోజులకి ముందే ఇచ్చేయాలి. దర్శకులకు చివరి నిమిషం వరకూ ఏదో చేయాలనే తాపత్రయం వుంటుంది. చూసింది పదిసార్లు జాగ్రత్తగా చూసి చివరి క్షణం వరకూ దానిపై చర్చజరుగుతుంది. ఇది ప్రతి సినిమాకి వుంటుంది.

పాన్ ఇండియా సినిమాలు విదేశాలకు వెళ్ళినపుడు నిడివి తగ్గిస్తారా ?
లేదు. అవార్డ్ లకి వెళ్ళే సినిమాకి మాత్రం పాటలు తీసేస్తాం. ఇండియన్ లాంగ్వేజస్ కి మాత్రం ఒక ఎడిట్ నే వెళుతుంది.
ఇన్నేళ్ళ కెరీర్ లో మీ ఫేవరేట్ సినిమా ?
ఫేవరేట్ అని ఏమీ లేదు. కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బావుండేదనిపిస్తుంది.

మీతోటి ఎడిటర్స్ మధ్య ఎలాంటి అనుబంధం వుంది?
మంచి అనుబంధమే వుంది. వర్క్ గురించి మాట్లాడుకుంటాం. మా కష్టాలు చెప్పుకుంటాం. సినిమా బాగా చేస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం.

ఒక సినిమాని విజయవంతం చేయడంలో ఎడిటర్ పాత్ర ఎంత వుంటుంది ?
ఒక దర్శకుడికి ఎడిటర్ కి రిలేషన్ షిప్ బావుంటే చాలా మంచి సినిమా అవుతుంది. ఎంత ఆర్గుమెంట్స్ జరిగితే రిజల్ట్ అంత మంచిగా వస్తుంది.

డైరెక్టర్ తన స్వేఛ్చతో ఎడిటర్ ని ఎన్నుకుంటాడా ? హీరో జోక్యం వుంటుందా ?
ఒకొక్క సినిమాకి ఒకొక్కలా వుంటుంది. ‘సారోచ్చారా’ తప్పితే పరశురాం అన్ని సినిమాలకి నేనే చేశా. దర్శకుడి తరపున వెళితే ఎడిటర్ బలంగా ఉంటాడు.

పాన్ ఇండియా సినిమాలని తెలుగు కాకుండా ఇతర భాషల్లో చూసినపుడు ఏమైనా తేడా ఉంటుందా ?
అలా ఏమీ వుండదు. కానీ రిమేక్ కి వచ్చేసరికి కొంచెం తేడా వుంటుంది. మలయాళం దృశ్యం నీట్ గా స్లోగా వుంటుంది. తెలుగులో చేసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టు మన స్టయిల్ లో చేశాం.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?
చిరంజీవి గారి గాడ్ ఫాదర్, భోళా శంకర్, సమంత కధానాయికగా యశోద సినిమాలకి చేస్తున్నా.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385