మ‌హేశ్ బాబు అభిమానుల‌కు పండుగ‌;ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

815

‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ..

ఈ సంక్రాంతి ఎలా ఉంటుంది?
– ఈ సంక్రాంతి గతేడాది కంటే ఎక్కువ నవ్వుకుంటారు. అదే విధంగా దేశభక్తి, ఎమోషన్స్, వాల్యూస్, అందరూ కోరుకునే ఫన్ ఇలా అన్ని మేళవించి సంక్రాంతి పిండి వంటలతో భోజనం ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉండబోతుంది.

ఒకే సినిమాలో దేశభక్తిని, ఎంటరైన్మెంట్ ని జోడించడం ఛాలెంజింగ్ గా అనిపించిందా?
– ఒక యుద్ధ వాతావరణం నుండి సాధారణ ప్రజల మధ్యకు వచ్చిన సైనికుడికి అందరూ చాలా అమాయకంగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దులో శత్రువులు వేరు, సమాజంలో శత్రువులు వేరు. వీళ్ళ కోసం కదా మనం ప్రాణాలు ఇస్తుంది. వీరందరూ భాద్యతగా ఉండాలి కదా అనేది హీరో క్యారెక్టరైజషన్. రేపు మీరు స్క్రీన్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ ఎక్కడా లైన్ దాటి వెళ్లి కామెడి చేసినట్టు ఉండదు. అలాగే ఎక్కువ సీరియస్ గా కూడా ఉండదు. ఆ క్యారెక్టర్ ని అంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు మహేష్ బాబు గారు.

సూప‌ర్‌స్టార్ మహేష్ తో వర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– మహేష్ గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వెంటనే మనకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఒక సోదరుడిలా ట్రీట్ చేస్తారు. చాలా సరదాగా మాట్లాడుతుంటారు. అందరి మీద జోక్స్ వేస్తుంటారు. దాంతో ఒక సూపర్ స్టార్ తో పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ కలగదు. అలాగే మానిటర్ దగ్గర ఉన్న డైరెక్టర్ ని గమనిస్తూ దర్శకునికి కావలసిన అవుట్ ఫుట్ వచ్చే వరకు చేస్తారు

చాలా కాలం తర్వాత విజయశాంతి నటిస్తున్నారు కదా! ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
– 13 ఏళ్ల తరువాత విజయ శాంతి గారు ఈ సినిమా చేశారు. అయితే ఇందుకోసం విజయశాంతి గారు ఈ క్యారెక్టర్ చేశారా..అనే విధంగా ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ విజయ శాంతి గారు. ఎందుకంటే గతంలోనే ఒక పాత్ర కోసం ఆమెని కలిశాను. మంచి క్యారెక్టర్ రాస్తే ఆమె చేస్తారు అనే పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆమె కోసమే ఆ పాత్ర రాశాను.

ఈ సినిమా మ‌హేశ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేశారా?
– మ‌హేశ్ బాబు నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటూ..అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునే ప‌ర్ప‌స్‌ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఈ సంక్రాంతికి అభిమానులకి, ప్రేక్షకులకి పండుగ లాంటి సినిమా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వ‌స్తున్నాయి?
ఈ సినిమాతో పాటు జ‌న‌వ‌రి 9న ర‌జిని కాంత్ `ద‌ర్భార్‌` జనవరి 12న బన్నీ త్రివిక్రమ్ `అలవైకుంఠపురములో`..` జనవరి 15`న నాకు మొదటి సినిమా ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ `ఎంత మంచి వాడవురా` విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతి పండుగకి విడుద‌ల‌య్యే అన్ని సినిమాలు బాగా ఆడాల‌ని, అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటున్నాను.. అంటూ ఇంట‌ర్య్వూ ముగించారు సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.