HomeTeluguరేపటి నుంచి "గూడుపుఠాణి" చిత్రం జీ 5 ఓ టి టి లో

రేపటి నుంచి “గూడుపుఠాణి” చిత్రం జీ 5 ఓ టి టి లో

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం “గూడుపుఠాణి “. ఈ చిత్రం 2021 డిసెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనం తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ “గూడుపుఠాణి” చిత్రం జీ 5 ఓ టి టి లో రేపు అనగా 8 జులై నా విడుదల కానుంది.

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ “మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ 5 వాళ్ళు మంచి రేట్ కి కొన్నారు. రేపు విడుదల అవుతుంది. థియేటర్ లో మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జీ 5 లో లభిస్తుంది. రేపే జీ 5 ఓ టి టి లో విడుదల అవుతుంది చూసి ఆనందించండి” అని తెలిపారు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES