HomeTelugu"ధగఢ్ సాంబ"

“ధగఢ్ సాంబ”

బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు) తన ఊరిలో సర్పంచ్ చేతిలో మోసపోతాడు. అలా తనలాగా ఎవ్వరూ మోసపోకూడదని హైదరాబాద్ వచ్చి మోసం చేసే ముఠాను ఒక పట్టు పడతాడు. ఈ క్రమంలో సాంబకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అలా సాగుతున్న సమయంలో మనుషుల రూపంలో ఉన్న దయ్యాలలాగా అందరిని నమ్మించే ఒక ముఠా ను సాంబ ఏ విధంగా శిక్షించాడు ? ఆ ముఠా ఎటువంటి నేరాలు చేస్తుంది ? ఈ క్రమంలో సాంబకు పరిచయం అయిన అమ్మాయి చివరికి సాంబను కలుస్తుందా వంటి విషయాలు తెలియాలంటే దగఢ్ సాంబ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సంపూర్ణేష్ బాబు ఎప్పటిలాగే తన నటనతో కామెడీ టైమింగ్ తో ఇరగదీసాడు. చాలా రోజుల తరువాత సంపూ నుండి ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా సంపూర్ణేష్ కు హిట్ సినిమాగా నిలుస్తుందనడంలో సందేశం లేదు. హీరోయిన్ సోనాక్షి తన పాత్ర పరిధి మేరకు సంపుతో కలిసి నటించి మెప్పించింది. నటి జ్యోతి పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణ. చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు పాత్రలు సినిమా కథలో వచ్చి సినిమా పూర్తి అయ్యే వరకు మనతో ఉండి నిలిచిపోతాయి. జబర్దస్త్ అప్పారావు పాత్ర సినిమాకు మరో హైలెట్, సంపూర్ణేష్, అప్పారావు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

నిర్మాత ఆర్.ఆర్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్: ఎన్.ఆర్.రెడ్డి రాసుకున్న పాయింట్ బాగుంది. సినిమా మొదటినుండి చివరివరకు ప్రేక్షకులను అలరించే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దగడ్ సాంబ సినిమా తో తనకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముజీర్ మాలిక్ కెమెరా వర్క్ బాగుంది. డేవిడ్.జి పాటలతో పాటు నేపధ్య సంగీతం బాగా ఇచ్చాడు. ఎడిటర్ కె.ఎ. వై.పాపారావు ఎడిటింగ్ నీట్ గా ఉంది.

ధగడ్ సాంబ సినిమా సంపూర్ణేష్ బాబుకు ఒక మంచి సినిమా అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. నవ్విస్తూ ఆలోచింపజేస్తూ సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES