HomeTeluguసంహారి ఆడియో విడుదల

సంహారి ఆడియో విడుదల


శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై కె. రవి కుమార్ రాణా మరియు నేహా శ్రీ హీరో హీరోయిన్ గా లక్ష్మి కేతావత్ మరియు రేణుక కేతావత్ సమర్పణలో కె. రవి కుమార్ రాణా స్వయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం “సంహారి”. ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆడియో రిలీజ్ వేడుకకి లయన్ సాయి వెంకట్, నాయి కోటి రాజు, గురు చరణ్ మరియు బైలాంపుడి నిర్మాత బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి సంహారి ఆడియో ను విడుదల చేసారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ “సంహారి సినిమా ట్రైలర్ మరియు పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్రం మ్యూజికల్ గా మంచి హిట్ అవుతుంది అని నమ్మకం నాకుంది. హీరో దర్శకుడు నిర్మాత రవి కుమార్ రాణా ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం మంచి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ “సంహారి లో నాలుగు పాటలు ఉన్నాయి. అని పాటలు చాలా మంచిగా కుదిరాయి. మంచి పాటలే కాదు చిత్రీకరణ కూడా బాగుంది. మా నిర్మాత హీరో రవి కుమార్ గారు మంచి డబ్బుతో సంహారి ని నిర్మించారు. చిత్రం చాలా గొప్పగా ఉంటుంది. కొత్త కథ అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

హీరో నిర్మాత దర్శకుడు రవి కుమార్ మాట్లాడుతూ “మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు మా చిత్రానికి ప్రాణం పోశారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి ఎలాగైనా సినిమా లో నటించాలి అని కోరిక ఉండేది. ఈరోజు నా కోరిక తీరింది. ఇది డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.

నాయి కోటి రాజు మాట్లాడుతూ “హీరో రవి ఫస్ట్ టైం సినిమా చేసాడు. పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. రవి హీరో గా బాగా చేసాడు. సినిమా మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

సినిమా పేరు : సంహారి

నటి నటులు : కె. రవి కుమార్ రాణా, నేహా శ్రీ

కెమెరా మాన్ : అంజి బాబు, కృష్ణ నాయుడు

సంగీతం : రాజ్ కిరణ్

ఎడిటింగ్ : వంశీ పెళ్లూరి

ఫైట్స్ : అశోక్ రాజ్

పి అర్ ఓ : పాల్ పవన్

డాన్స్ మాస్టర్ : ఉమా శంకర్, మనోజ్ పెద్ది

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : కె. రవి కుమార్ రాణా


Pavan Kumar

9849128215

Film Reporter

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES