“అందమైన లోకం” షూటింగ్ ప్రారంభం

354


సహస్ర ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో, హీరోయిన్స్ గా  మోహన్ మర్రిపెల్లి  దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం  “అందమైన లోకం”. శుక్రవారం ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమానికి మడత కాజా డైరెక్టర్  సీతారామరాజు, గుంటారోడు డైరెక్టర్ సత్యరాజ్, సభకు నమస్కారం డైరెక్టర్ సతీష్ మల్లంపాటిలు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ మరిపెల్లి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను 100 కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ నుండి వస్తున్న నేను ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ తయారు చేసుకొని నిర్మాతకు చెప్పడం జరిగింది. నిర్మాతకు ఈ కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు.  మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రస్తుతం లవ్ లో ఉన్న వారు, లవ్ ఫెయిల్యూర్ అయినవారు కానీ, లవ్ లో పడాలి అనుకునే వారికి కానీ… ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతూ ట్విస్ట్ & టర్న్స్ తో మంచి మెసేజ్ తో వస్తున్న ఈ “అందమైన లోకం” ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది.పాటలు చాలా బాగా వచ్చాయి. ప్రశాంత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మంచి నటీనటులు తో చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత డాక్టర్ రవీంద్ర నాయుడు మాట్లాడుతూ… నేను సినిమా చేద్దామనుకున్న టైంలో దర్శకుడు నాకీ కథ చెప్పాడు. ఈ కథ విన్న నేను చాలా ఎక్సయిట్ అయ్యాను. తరువాత మేము ఈ స్క్రిప్ట్ చాలా రోజులు వర్క్ చేశాము. ఫైనల్ గా స్క్రిప్ట్ అంతా అద్భుతంగా తయారు చేసుకొని మంచి టీంను సెలెక్ట్ చేసుకొని అంత ఒక యూనిటీతో ఈ సినిమా చేస్తున్నాము. మా బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు.

హీరో డాక్టర్ వెంకీ మాట్లాడుతూ… దర్శకుడు మోహన్ మర్రిపెల్లి గత 5 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ తను మంచి మంచి లవ్ స్టోరీస్ తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటాడు. ఈ టీంతో నేను ఎప్పటినుండో కనెక్ట్ అవుతూ వస్తూన్నాను. మేమందరూ కలసి మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. రొటీన్ లవ్ స్టొరీ కాకుండా ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీని పరిచయం చేద్దామని ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని తయారు చేసుకొన్నాం. తరువాత ఈ కథ నిర్మాతకు నచ్చడంతో  నిర్మాత సహకారంతో  మంచి టీంను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేస్తున్నాము. ఈ కరోనా టైం లో లవ్ స్టొరీ కథలు చాలా వున్నా ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టొరీ లో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియన్స్ కే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ…  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి టీమ్ తో వస్తున్న మా టీం కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు.

హీరోయిన్ చాందిని భగవాని మాట్లాడుతూ… రథం, దిక్సూచి, చిత్రాల తర్వాత నేను చేస్తున్న మూడవ సినిమా “అందమైన లోకం” . ఫుల్ లవ్ అండ్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. మంచి టీమ్ తో వస్తున్న ఈ సినిమాలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డి.ఓ.పి. శ్రావణ్ మాట్లాడుతూ… మంచి ఎమోషనల్, లవ్ స్టోరీ కి నేను డి.ఓ.పిగా చేయడం చాలా ఆనందంగా ఉంది.  మంచి మంచి లోకేషన్స్ లలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్నారు.

సంగీత దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ… నేను మోహన్ గారు డిఓపి గారు కలిసి చాలా సినిమాలు చేశాను ఇప్పుడు మళ్ళీ మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తాను. పెద్ద సింగర్స్ ను సెలెక్ట్ చేసుకొని  పాటలు పాడించడం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను తప్పక అలరిస్తాయని అన్నారు.

నటీనటులు
డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
నిర్మాత :- డాక్టర్ రవీంద్ర నాయుడు
రైటర్, దర్శకత్వం :- మోహన్ మర్రిపెల్లి
డి.ఓ.పి :- ఎడిటింగ్,డి ఐ :- శ్రావణ్ జి కుమార్
సంగీతం :- ప్రశాంత్ బిజె,
డిజైన్స్ :- యమ్ కె యస్ మనోజ్
పీఆర్వో:- పాల్ పవన్