గ్రాండ్ గా “రుద్రవీణ” ప్రి రిలీజ్..ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్

175


రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత రాగుల లక్ష్మణ్, మాట్లాడుతూ..మా రుద్ర వీణ ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు ఇందులో ఎల్సా, శుభశ్రీ లు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అలాగే మరో నటి సోనియా లేడీ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ చేసింది.ఇలా ఇందులో ఉన్న ముగ్గురు అమ్మాయిలు చాలా కష్టపడి పని చేశారు.రఘు కుంచె విలన్ గా అద్భుతమైన నటనను కనపరచ్చాడు. హీరో కు ఈ సినిమా తర్వాత మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా మనం ఎప్పుడూ చూడని కథను చూస్తారు. ఇందులోని పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా అద్భుతంగా వచ్చాయి .మనకు జరిగే ప్రతి ఫెస్టివల్ లో ఈ సాంగ్స్ ప్లే అయ్యేలా ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో ఈ నెల 28 న థి యే టర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రుద్ర వీణ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

మరో నిర్మాత రాగుల శ్రీను మాట్లాడుతూ…మా అమ్మ గారి నిర్మాణంలో మేము ఈ సినిమా తీశాము.చిన్నప్పటి నుండి మేము చిరంజీవి కి బిగ్ ఫ్యాన్స్ .అయితే ఇప్పుడు మేము తీసిన సినిమాకు చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా “రుద్ర వీణ” టైటిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రఘు కుంచె విలన్ గా చాలా బాగా నటించారు. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 28 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. రుద్రవీణ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. విలన్ క్యారెక్టర్ చేస్తున్న నా ముఖానికి గాటు ఉండేలా డిఫరెంట్ లుక్ డిజైన్ చేశారు. హీరోయిన్స్ కూడా వారి, వారి నటనను ప్రూవ్ చేసుకునేలా చాలా బాగా చేశారు. హీరో హెవీ ఎమోషన్ ఉండే చాలా పెద్ద క్యారెక్టర్ చేశాడు. తనకు మంచి పేరువస్తుంది.ఈ సినిమాకు నిర్మాతల సహకారం మరువలేనిది అందరినీ చాలా బాగా చూసుకున్నారు.కమర్సియల్ గా ఇందులో లవ్, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా ఉంటుంది. ఫుల్ ప్యాకేజ్డ్ గా వస్తున్న “రుద్రవీణ” చిత్రం కచ్చితంగా చిన్న సైజు అఖండ లా అద్భుతంగా తీశారు. ఈ నెల 28 న వస్తున్న ఈ సినిమా గొప్పవిజయం సాదించాలి అన్నారు.

చిత్ర దర్శకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..మా రుద్ర వీణ ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.నిర్మాతలు లక్ష్మణ్, శ్రీను గార్లు నన్ను సొంత బ్రదర్ లా ట్రీట్ చేశారు.వారికి ఈ కథ నచ్చడంతో అనుకున్న బడ్జెట్ ఎక్కువైనా సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు .మంచి కథతో వస్తున్న మా సినిమాను ఆదరిస్తే నిర్మాతలు మళ్ళీ మరో మంచి సినిమాతో మీ ముందుకు వచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.ఇందులో రఘు కుంచె గారు అద్భుతంగా నటించారు. వీరితో పాటు హీరో, హీరోయిన్ లు అందరూ చాలా బాగా నటించారు. ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది. ఈ నెల 28 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో శ్రీ రామ్ నిమ్మల మాట్లాడుతూ.. ఈ టైటిల్ పెట్టుకోవడానికి చాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదములు. మా సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం మెగాస్టార్ గారే. నిర్మాత లక్ష్మణ్ గారు చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్, దాంతో తను ఈ సినిమాకు ఆ టైటిల్ వచ్చేలా చాలా కష్టపడ్డారు.తనకిది మెదటి సినిమా అయినా అన్ని క్రాఫ్ట్ లలో చాలాబాగా మానేజ్ చేశాడు. సినిమాకు ఏమి కావాలన్నా కూడా ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని చాలా బాగా నిర్మించాడు. దర్శకుడు నన్ను మాస్ హీరో లా ఊహించుకొని నా పాత్ర ను చాలా చక్కగా మలచారు.రఘు కుంచె గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కెమెరామెన్ నన్ను చాలా బాగా చూయించాడు. నాకిలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరోయిన్ ఎల్సా మాట్లాడుతూ..లవ్, రొమాంటిక్, కామెడీ, రివేంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరూ చాలహార్డ్ వర్క్ చేసి సినిమాను పూర్తి చేశాము. దర్శక, నిర్మాత నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

మరో హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

జగదీశ్ మాట్లాడుతూ.. 10 సినిమాలు తీద్దామని లక్ష్మణ్ గారు ఇండస్ట్రీ కి వచ్చారు. మెదటగా చిరంజీవి గారి హిట సినిమా సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాతో పాటు తను తీయబోయే సినిమాలన్నీ కూడా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు

గెటప్ శ్రీను మాట్లాడుతూ..ఈ నెల 28 న విడుదల అయ్యే “రుద్రవీణ” సినిమా తో హిట్ అనే ముద్ర వేసుకోబోతున్నారు. దర్శకుడు మధు చాలామంది ఆర్థిస్టిలను సినిమా అవకాశం కల్పించారు మహావీర్ మ్యూజిక్ చాలా బాగుంది. చిరంజీవి గారు పాటలు వింటూ వచ్చాను. ఇప్పుడు ఆయన టైటిల్ తో ఈ నెల 28 న వస్తున్న జిన్నా సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు

మరో హీరోయిన్ శుభశ్రీ  మాట్లాడుతూ..ఇది నా ఫస్ట్ మూవీ. రఘుకుంచే, శ్రీ రామ్ ఇలా అందరితో కలసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

శ్రీని ఇన్ఫ్రా శ్రీను మాట్లాడుతూ. నీ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ బిగ్ హిట్ అయ్యి అందరి మనసులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ , రఘు కుంచే (విలన్) చలాకి చంటి,సోనియా, రమణారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : లక్ష్మణ రావు రాగుల,
డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల
మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్
డి ఓ పి : జి ఎల్ బాబు
ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు
ఆర్ట్ : గిరి
యాడ్స్ డిజిటల్ :మనోజ్ తడి
పి.ఆర్.ఓ : హరీష్ -దినేష్