నటుడు ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించిన ‘రుద్రాక్షపురం’ టైటిల్ పోస్టర్

488


పీఆర్వో వీరబాబు ప్రధాన పాత్రలో టెన్ ట్రీస్ ఫిలం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విడుదల చేసి, ఈ చిత్ర టైటిల్ విభిన్నంగా ఉందని, కొత్తదనంతో కూడిన ఈ చిత్రం విజయవంతం కావాలని చిత్రయూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. ఈ టైటిల్ లుక్ లాంచ్ కార్యక్రమములో నిర్మాత సురేశ్ కొండేటి, నటులు హేమ, రమణా రెడ్డి, నటుడు అండ్ డిస్టిబ్యూటర్ రాఘవేంద్ర, అశోక్ మున్నూర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

‘‘అనంతపురం జిల్లా ‘రుద్రాక్షపురం’ ఫారెస్ట్‌లో 2018‌లో జరిగిన ఓ యధార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని దర్శకుడు ఆర్.కె. గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి సాంకేతిక వర్గం కుదిరింది. పీఆర్వో వీరబాబు ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు..’’ అని నిర్మాత కనకదుర్గరాజు తెలుపగా.. ‘‘ఈ చిత్రం సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే కథనంతో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో సాగుతుంది. అ
క్టోబర్ 12 నుండి అనంతపురం, కర్నూల్ ప్రాంతాలలో షూటింగ్ ప్రారంభిస్తాము..’’ అని దర్శకుడు ఆర్ కె గాంధీ తెలిపారు.

మణి సాయితేజ వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, పూజ, పీఆర్వో వీరబాబు, నాగమహేష్, జీవా, గిరి, పవన్, రాజేంద్ర, ఆనంద్, అక్షర నిహా, రాజేశ్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: ప్రమోద్ ఆర్
సంగీతం: ఘంటాడి కృష్ణ
స్టంట్స్: థ్రిల్లర్ మంజు, మల్లి సంకలనం
నిర్మాత: కనకదుర్గరాజు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ