ప్రస్తుతం మన సమాజంలో దంత సంరక్షణ పట్ల శ్రద్ధ, అవగాహన పెరిగాయి. అందుకు తగినట్లుగా పూర్తిస్థాయి మోడరన్ టెక్నాలజీతో స్థాపించబడిన రూట్స్ డెంటల్ కేర్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది” అన్నారు ప్రముఖ నటులు, నిర్మాత, రియల్టర్ డాక్టర్ మాగంటి మురళీమోహన్.
ఏప్రిల్ 7న హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో TV 5 ఎదురుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పబడిన రూట్స్ డెంటల్ కేర్ హాస్పిటల్ ప్రధాన విభాగాన్ని మురళీమోహన్ ప్రారంభించగా ప్రముఖ దర్శక రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ “టచ్ లెస్ అండ్ పెయిన్ లెస్ స్క్రీనింగ్ ” విభాగాన్ని , ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు “ఏ ఐ రోబోటిక్ మిషన్ రూమ్” ను, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు వినాయక రావు ,ప్రభు ,సురేష్ కొండేటి క్యాడ్ క్యామ్ టెక్నాలజీతో కూడిన డిజిటల్ డెంటిస్ట్రీ విభాగాన్ని ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటులు బెనర్జీ,రామ్ జగన్ ,శ్రీ రామ్, సీనియర్ మోస్ట్ మేకప్ మ్యాన్ కొల్లి రాము, రూపా మాగంటి, రాగా మాగంటి , ప్రముఖ ఆడిటర్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ సంతోష్ గౌడ్ డాక్టర్ కొల్లి ప్రభుతేజ్ ప్రారంభించిన ఈ రూట్స్ డెంటల్ కేర్ హాస్పిటల్ మరింత విస్తృతస్థాయిలో విజయవంతం కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరూ ఆకాంక్షించారు.