గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

299

అశ్విన్ & రమేష్.కె సమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం “రూమ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామారాజ్ చేతుల మీదుగా” రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ నుండి ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సుబ్బారావు.ఏ సినిమా చేసినా ఏది ఆడుతుంది, ఏది ఆడదు,ఎంత కలెక్షన్ చేస్తుంది అని క్యాలిక్యులేషన్ చేసి చెపుతాడు.గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్న తను ఈ మధ్య వచ్చిన “అఖండ” సినిమాను అనౌన్స్ చేసిన రోజునే ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని రాయలసీమ హక్కులను తీసుకోవాలని ముందుకు వచ్చాడు. అంత పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఈ రోజు రూమ్ సినిమా చేస్తున్నాడు అంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పచ్చు. నిర్మాత రామరాజు గారి అబ్బాయిని హీరోగా, మనో చిత్రను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకొని చాలా మంచి టెక్నిషియన్స్ పెట్టుకొని ఈ సినిమా తీశాడు. మంచి కంటెంట్ తో వస్తున్న “రూమ్” సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

చిత్ర నిర్మాత సుబ్బారావు మాట్లాడు..1980 నుండి గుంటూరు జిల్లా పద్మావతి ఫిలిమ్స్ మీద డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేశాను.1986 హీరో అర్జున్ తో కోన సీమ కుర్రాడు, 1988 లో శోభన్ బాబు, రాధిక లతో “అన్నా చెల్లెళ్లు’వంటి సినిమాలు తీశాను.నేను 80% చిరంజీవి గారి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను.అయితే రెండు సంవత్సరాల క్రితం నాకు తెలిసిన దర్శకుడు కన్మని తో రొమాంటిక్, ఎంటర్టైన్మెంట్ ఉన్న మంచి కథతో సినిమా చెయ్యాలి అన్నాను. తమిళ్ డైరెక్టర్ పద్మమగన్ దగ్గర అలాంటి కథ ఉంది. తను తీసిన “పార్టీబన్” సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. తమిళ్ లో చేయమని చెప్పగా తెలుగులో అయితే చేస్తాను అని చెప్పాను. దర్శకుడు పద్మమగన్ కు తెలుగు రాదు కాబట్టి కన్మని సపోర్ట్ తో తెలుగులోకి స్క్రిప్ట్ మార్చడం జరిగింది. తరువాత సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన “అదుగో” సినిమాలో హీరోగా చేసిన అభిషేక్ వర్మ ను సెలక్ట్ చేశాము. అలాగే హీరోయిన్ మనో చిత్ర ను తీసుకొన్నాము. ఇందులో హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు. “రూమ్” సినిమాకు మంచి టెక్నిషియన్స్ లభించడంతో సినిమా బాగా వచ్చింది. గురజాల సుబ్బారావు సపోర్ట్ తో తీసిన యూత్ ఫుల్ సబ్జెక్టు రూమ్ ను సినిమాను నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము.ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత రామారాజ్ మాట్లాడుతూ.. సుబ్బారావు, నేను మంచి మిత్రులు.తన సినిమాలో మా అబ్బాయిని హీరో గా సెలక్ట్ చేసుకున్న సుబ్బారావు కు ధన్యవాదములు. దర్శకుడు మా అబ్బాయితో బాగా చేయించాడు. ఈ సినిమా మా అబ్బాయికి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ..చిత్ర నిర్మాత సుబ్బారావు గారు గత 40సంవత్సరాల నుండి సినిమా హిట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.అలాంటి తను సెలక్ట్ చేసుకున్న కథ చాలా బాగుంది.ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. దర్శకుడు ఈ సినిమాను చాలా న్యాచురల్ గా తీశాడు. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లు చాలా బాగా యాక్ట్ చేశారు.ఇప్పుడున్న యూత్ కు ఈ సినిమా బాగా అటాచ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుంది అన్నారు.

చిత్ర దర్శకుడు పద్మమగన్ మాట్లాడుతూ.. కొత్త వారితో ఏ జానర్ చేసినా క్వాలిటీ లో రాజీ పడకుండా సినిమా చేస్తాను.ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది లిమిట్ లోనే ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీతో ఈ సినిమా చేశాము. హీరో,హీరోయిన్ లతో మొదటగా వర్క్ షాప్ చేసి ఓకే అనుకున్న తరువాత షూట్ కెళ్ళాము .ఈ సినిమా ను 60% ఓకే రూమ్ లో షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న యూత్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.బాష ఏదైనా నన్ను నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు.

సహాయకుడిగా వర్క్ చేసిన దర్శకుడు కన్మని మాట్లాడుతూ.. సుబ్బారావు గారితో ఎక్కువ పరిచయం ఉండడంతో తను నాతో ఒక మంచి జోనర్ లో ఉన్న సినిమా చెయ్యాలి కథ ఉందా అని అడిగాడు. నా ఫ్రెండ్ పద్మమగన్ దగ్గర ఉంది తను బాగా తీస్తాడు, తను చేసిన పార్తీబన్ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చింది అని చెప్పాను. దర్శకుడికి తెలుగు రానందున స్క్రిప్ట్ లో హెల్ప్ చేశాను. హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా చక్కగా నటించారు. బెనర్జీ లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో ఉన్నందున ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. ఈ సినిమాలో కంప్లీట్ ఫన్ ఉంటుంది. చూసిన యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు..నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర హీరోయిన్ మనో చిత్ర .. తెలుగులో శ్రీకాంత్ గారితో మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, తరువాత నాటుకోడి, జై సేన వంటి సినిమాలు చేశాను. తెలుగు,తమిళ్ లో ఇప్పటి వరకు 23 సినిమాలు చేశాను.ఇన్ని సినిమాలు చేసినా అనుకున్నంత పేరు రాలేదు. ఈ సినిమా లాస్ట్ హోప్ అనుకొని చేశాను.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.ఇది ఎక్కువ శాతం ఒకే రూమ్ లో షూటింగ్ జరుగుతుంది అని స్టోరీ లైన్ చెప్పడంతో ఎలాంటి క్లారిటీ లేకుండా ఒకే రూమ్ లో ఏం చేస్తాము ఈ సినిమా చేయను అన్నాను.ఆ తరువాత ఈ సినిమాకు దర్శకుడు పద్మమగన్ అని చెప్పారు. తనతో ఇంతకు ముందు ఒక సినిమా చేశాను కాబట్టి ఈ మూవీ చేశాను. కెమెరామెన్ యమ్. యస్ ప్రభు గారు నన్ను చాలా అందంగా చూయించారు.దర్శకుడు ఇదే లాస్ట్ సినిమా అనుకుని చేశావు కానీ ఇదే నీ మొదటి సినిమా ఈ సినిమా తర్వాత నీకు అనేక సినిమాలలో నటించే అవకాశం వస్తుంది అన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా నవ్వుకునేలా సినిమా చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ అని చెప్పవచ్చు .ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు

సహా నిర్మాత అశ్విన్ మాట్లాడుతూ..”రూమ్” సినిమా బాగా వచ్చింది. త్వరలో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. రూమ్ సినిమా నాకు వెరీ స్పెషల్, ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశారు. ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. అందుకే ఇందులో పాటలు లేవు..ఒకటే లొకేషన్ లో ఉన్నా మనకు ఆలా అనిపించకుండా దర్శకుడు తన స్క్రీన్ ప్లే తో బంధించేశాడు. యూత్ కు మాత్రం రూమ్ సినిమా అవుట్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుందని అన్నారు

నటీ నటులు
అభిషేక్ వర్మ, మనో చిత్ర , బెనర్జీ, సంపంత్ రామ్ , తెరి దీన, తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : వి. యస్. సుబ్బారావు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పద్మమగన్
డి. ఓ. పి.: యమ్. యస్. ప్రభు
ఎడిటర్ : సి. యస్ ప్రేమ్
మ్యూజిక్ డైరెక్టర్ : వినోద్ యాజమాన్య
ఆర్ట్ డైరెక్టర్ : పి. రాజు