‘బ్యూటిఫుల్ ‘గా వర్మ డాన్స్ , ప్రీ రిలీజ్ వేడుకలో హైలెట్!!

753

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా `అగస్త్య మంజు` దర్శక‌త్వంలో రూపొందిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `బ్యూటిఫుల్` (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాత‌లు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుద‌ల‌కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 23న హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నైనా గంగూలీ విసిరిన స‌వాల్‌కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సారి స్టేజ్ మీద నైనా గంగూలీతో క‌లిసి డాన్స్ వేసి ఆమెకు బ‌దులివ్వ‌డం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి .కల్యాణ్, తుమ్మలపల్లి రాంసత్యనారాయణ, న‌ట్టి కుమార్‌,చంద్ర సిద్దార్థ్, బి వి ఎస్ రవి, తదితరులు పాల్గొన్నారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ – “ బ్యూటిఫుల్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను ‘రంగీలా’ సినిమా తీయడానికి చాలాముఖ్యకారణం ఊర్మిళ. ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను రంగీలా సినిమా తీసుండేవాణ్ణి కాదు. అదే ఇప్పుడు నైనా విషయంలో జరిగింది. కొంత మంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేక మైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా కాస్టింగ్ కోసం చూస్తున్నప్పుడు అదే జరిగింది. అగస్త్యమంజు మీద నాకెప్పుడూ చాలా నమ్మకం ఉంటుంది.  ” అన్నారు.

దర్శకుడు అగస్త్యమంజు మాట్లాడుతూ – ” ఈ సినిమా అంతా బొంబాయి లో ఉన్న దారవి అనే ఏరియాలో జరుగుతుంది. అది అంత ‘బ్యూటిఫుల్’ ప్లేస్ కాదు. కానీ అక్కడ మనుషులు బ్యూటిఫుల్ గా ఉంటారు. అందుకనే ఈ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది’ అన్నారు.

నిర్మాత సి .కల్యాణ్ మాట్లాడుతూ – “సినిమా అయినా, కాంట్రవర్సీ అయినా రాము అంత క్రియేటర్ లేరు. సెన్సేష‌న‌ల్‌ అనే పదం మీతోనే ఉంటుంది. అలానే ఉండాలని కోరుకుంటున్నా.త్వరలో శివ లాంటి మ‌రో మూవీ తీయాలని కోరుకుంటున్నా” అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు టి. అంజయ్య మాట్లాడుతూ – ” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక దర్శకుడు అన్ని జోనర్స్ లో సినిమా తీయడం ఆయనకే చెల్లింది. ఇండస్ట్రీ కి ఒక డిక్షనరీ లాంటివారు. జనవరి 1విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.