Artists:
సాయి రోణక్, అమృతా చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, భరత్, అభిషేక్ విశ్వకర్మ , సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్ తదితరులు
Technicians:
స్క్రీన్ ప్లే, నిర్మాత , దర్శకత్వం: కళ్యాణ్ చక్రవర్తి
నిర్మాణం : క్రాస్ వైర్ క్రియేషన్స్
మ్యూజిక్ : ఆశీర్వాద్
సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్
ఎడిటర్ : తుషార పాలా
లిరిసిస్ట్ : రవివర్మ ఆకుల
Moviemanthra.com/రేటింగ్ : 3.25/5
Release date;18/10/2024
సాయి రోణక్ హీరోగా, అమృత చౌదరి హీరోయిన్ గా క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్ పై కళ్యాణ చక్రవర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి తెరకెక్కిన చిత్రం రివైండ్. ఈ సినిమాకి శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా, తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. ఆశీర్వాద్ సంగీతం అందించారు. కేఏ పాల్ రామ్ , జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ , భరత్ , ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీపావళి పండుగకు ముందే ఈనెల 18వ తేదీన అంటే ఈరోజున సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా కథ ఏంటి ..? డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
కథ:
డివైండ్ సినిమా విషయానికొస్తే.. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కార్తిక్ ( సాయి రోణక్), తాను ఉంటున్న అపార్ట్మెంట్ లో ఉండే శాంతి (అమృతా చౌదరి) ని చూసి మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. శాంతి తన ఆఫీసులోనే పనిచేస్తుంది అనే విషయం తెలిసి మరింత సంతోషపడతాడు. ఎలాగైనా సరే ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అలా తన ప్రేమను ఆమెతో చెప్పే లోపే , ఆమె తనకు ఒక ప్రియుడు ఉన్నాడంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే శాంతి తాత (సామ్రాట్) కు చెందిన ఒక బ్యాగ్ తన ఇంట్లోనే ఉందని తెలుసుకున్న కార్తీక్, ఒకరోజు దాని ద్వారా టైం ట్రావెల్ చేయడానికి సిద్ధం అయిపోతాడు. ఇక శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని కలవకుండా చేస్తే, శాంతి తనతో ప్రేమలో పడొచ్చని అలా చేస్తాడు కార్తీక్. అయితే అలా టైం ట్రావెల్ ద్వారా వెనక్కి వెళ్ళిన కార్తీక్ అప్పుడు జరిగిన పరిణామాలను మార్చగలిగాడా..? శాంతిని తన ప్రియుడు నుంచి విడగొట్టాడా..? శాంతి తాతకు చెందిన బ్యాగ్ కార్తీక్ ఇంటికి ఎలా వచ్చింది? టైం ట్రావెల్ ఉపయోగించి వెనక్కి వెళ్ళిన కార్తీక్ తన తండ్రి (సురేష్) చావును తప్పించగలిగాడా..? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే విషయాలు తెలియాలి అంటే థియేటర్ కి వెళ్లాల్సిందే.
నటీనటుల పర్ఫామెన్స్ & టెక్నికల్ సిబ్బంది పనితీరు..
నటీనటుల విషయానికొస్తే.. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తిక్ పాత్రలో సాయి రోణక్ అద్భుతంగా నటించారు. ఒక పోష్ కుర్రాడిగా కనిపిస్తూ అమ్మాయిలను అట్రాక్ట్ చేశాడు. అటు అమృత కూడా శాంతి పాత్రలో ఒదిగిపోయి కనిపించింది. ఒకపక్క అందంగా కనిపిస్తూ మరొక పక్క తన నటనతో ఆకట్టుకుంది. అలాగే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇద్దరి జోడీ స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. కళ్యాణ్ చక్రవర్తి మొదటిసారి దర్శకత్వం వహించినా తనలోని టాలెంట్ ను పూర్తిగా ఉపయోగించారు. అంతేకాదు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఆయన దర్శకత్వంలో ట్రైనింగ్ తీసుకోలేదు. స్టోరీ , డైరెక్షన్ , స్క్రీన్ ప్లే అన్నీ కూడా సొంతంగా తన ప్రతిభను ఉపయోగించి తెరపై చూపించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం.
విశ్లేషణ..
ఈ సినిమాకి 100 కి 100 మార్కులు దర్శకుడికి పడతాయి. కథతో పాటు స్క్రీన్ లేని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఎంతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో థియేటర్లలో ఆడియన్స్ను కూర్చోబెట్టి మరి చూపించగలిగాడు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల ట్రాక్, టైం ట్రావెల్ ట్రాక్ , లవ్ ట్రాక్, డైలాగ్స్,సాంగ్స్ అన్నీ కూడా అద్భుతం.. ఫస్ట్ టైం లోనే సక్సెస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సినిమా ఎండింగ్ వరకు హీరో హీరోయిన్ కి.. మధ్య టచ్.. లేకుండా.. అయినా కానీ చాలా చక్కగా రొమాంటిక్ యాంగిల్ క్రియేట్ చేస్తూ.. మంచి ప్రేమ కథను చూపించిన డైరెక్టర్ గా నిలిచిపోయారు. సాంగ్స్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సెకండ్ హాఫ్ లో సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తానికైతే ఈ సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా.