ఘనంగా ప్రారంభం అయిన రెడ్డీస్ ముల్టీప్లెక్

618

ఇది కలియుగం కాదు, డిజిటల్ యుగం. మనకి ఏది కావాలి అన్న వార్త అయినా వినోదం అయినా క్షణంలో లో మన ముందుంటుంది. ఇప్పుడున్న దిన పత్రికలూ టీవి ఛానల్ కన్నా దీటైన్నది సోషల్ మీడియా. సోషల్ మీడియా లో అతిముఖ్యమైనది యూట్యూబ్. ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు యూట్యూబ్ లో క్షణంలో ప్రత్యేక్షం. యూట్యూబ్ మన జీవితంలో భాగం అయిపొయింది. ఇప్పుడు రెడ్డీస్ ముల్టీప్లెక్ వారు ప్రేక్షకులను మరింతా కనువిందు చేయటానికి సరికొత్త ఛానల్ లతో మన ముందుకు వస్తున్నారు. పొలిటికల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళలకోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి ని ఇలా ఎన్నో సరికొత్త చానెల్స్ ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో అతిధుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.

రెడ్డీస్ ముల్టీప్లెక్ ప్రారంభోత్సవానికి దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి, నగరి ఎమ్ ఎల్ ఏ రోజా, మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్, నరసింహ రెడ్డి, విద్య వతి, అవినాష్ రెడ్డి, రవి చంద్ర రెడ్డి, స్నేహ, శైలజ చరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, బియగూడ హరీష్, తదితరులు పాల్గున్నారు.

అనంతరం నగరి ఎమ్ ఎల్ ఏ రోజా మాట్లాతూ“మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎతైన ఎదుగుతారు దానికి నిదర్శనమే శైలజ చరణ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్, ఓ టి టి సినిమాలు, టి వి ఛానల్ ఇవి అన్ని చాలా రిస్క్ తో కూడుకున్న వ్యాపారాలు, మా శైలజ రెడ్డి గారికి ధెర్యం ఎక్కువ, వారు ఈ రంగం లో కూడా మంచి విజయం సాదించాలి అని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని మరింత ఎంటర్టైన్ చేయాలనీ కోరుకున్నారు.

ఎస్ వి కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ “ఈ రెడ్డీస్ ముల్టీప్లెక్ నేటి యూత్ కి మంచి వేదిక అవుతుంది. సినిమాలు, యూట్యూబ్ ఛానల్, రియల్ ఎస్టేట్ అని మంచి పద్ధతితో చేస్తున్నారు. మంచి విజయం సాదించాలి అని కోరుకున్నారు.

శైలజ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ “ఈ రెడ్డీస్ ముల్టీప్లెక్ నాకు కొత్తయిన నేను విజయం సాధిస్తానని నమ్మకం నాకుంది. ఈ రెడ్డీస్ ముల్టీప్లెక్ కులానికి కానీ మతానికి కానీ ఏ రాజకీయానికి సంబంధించింది కాదు కానీ రెడ్డి అంటే అందరికి మంచి చేసేవాడు, అందరిని రక్షించేవాడు అని ఈ పేరు పెట్టడం జరిగింది. నేటి యూత్ కి కావాల్సిన అని హంగులు మా యూట్యూబ్ చానెల్స్ లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే అందరికి చిన్న చూపు ఉంది కానీ ఇప్పటి శాటిలైట్ చానెల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ గా దూసుకుపోతున్నాయి. ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి ద్వారా అని భాషల్లో సినిమాలు చేస్తాము. రియల్ ఎస్టేట్ లో పేద వాళ్ళకి సహాయంగా తక్కువ ధరతో అందరికి ఇళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నాము. త్వరలోనే శాటిలైట్ ఛానల్ ని కూడా ప్రారంభిస్తాం” అని తెలిపారు.

మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్ గారు మాట్లాడుతూ “రెడ్డీస్ ముల్టీప్లెక్ ప్రారంభించిన శైలజ గారికి, విజయ్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు. వారు ప్రాంరంభించిన ఈ రెడ్డీస్ ముల్టీప్లెక్ లో విజయం సాదించాలి అని యూత్ కి కొత్త వారికీ టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.

విజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ “టాలీవుడ్ అనేది ఒక చేపల చెరువు, కానీ ఇప్పుడు ఆన్ లైన్ అనే మహా సముద్రం ఆ చేపల చెరువు ను మిగేసింది. ఇప్పుడు ప్రపంచం అంత యూట్యూబ్ మరియు ఓ టి టి లనే చూస్తుంది. మేము మా చానెల్స్ ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరి దగ్గరైన మంచి కథ ఉండి డైరెక్షన్ చేయగాలే టాలెంట్ ఉంటె మేము అవకాశం ఇష్టం. రెడ్డీస్ ముల్టీప్లెక్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో కొత్త యూట్యూబ్ చానెల్స్ తో మీముందుకు వస్తున్నాం. అని రంగాల వారికీ అవసరమైన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, మహిళలకి బ్యూటీ ఛానల్, రాజకీయ ప్రియులకి పొలిటికల్ ఛానల్ ఎలా అని రంగాల చానెల్స్ ని మేము మా రెడ్డీస్ ముల్టీప్లెక్ లో సమకూరిస్తాం.

PRO: VASU SAJJA